Home సినిమా గాసిప్స్ తారక్ కోసం త్రివిక్రమ్ ఆమెను పట్టుకొస్తున్నాడా?

తారక్ కోసం త్రివిక్రమ్ ఆమెను పట్టుకొస్తున్నాడా?

Trivikram Hunt For Heroine In NTR Movie Goes On

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించి రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త నాన్-బాహుబలి రికార్డులను క్రియేట్ చేశాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో త్రివిక్రమ్ తన నెక్ట్స్ మూవీని రెడీ చేసే పనిలో పడ్డాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌‌తో కలిసి తన నెక్ట్సి చిత్రాన్ని తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమాను అనౌన్స చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. కాగా గతంలో తారక్‌తో కలిసి త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో తారక్-త్రివిక్రమ్ కాంబోకు మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఇప్పుడు తారక్ 30వ చిత్రంగా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేయబోతున్న సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

అయితే ఈ సినిమాలో తారక్ సరసన హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారా అనే ఆసక్తి ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో నెలకొంది. కాగా త్రివిక్రమ్‌కు కలిసొచ్చిన పూజా హెగ్డేనే ఈ సినిమాలో నటిస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ తారక్ సరసన ఓ కొత్త మొహాన్ని చూపిస్తే బాగుంటుందని భావించిన త్రివిక్రమ్ ఈ మేరకు అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను ఇందులో హీరోయిన్‌గా తీసుకోవాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad