Home సినిమా గాసిప్స్ హిట్ కాంబో రిపీట్ కానుంది ?

హిట్ కాంబో రిపీట్ కానుంది ?

HYM26VENKATESH

ప్రస్తుతం నారప్ప సినిమాతో బిజీగా ఉన్న విక్టరీ వెంకటేష్ తన తదుపరి చిత్రాల పై దృష్టి పెట్టాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా విక్టరీ కెరీర్లో 74 చిత్రంగా రానుంది. అంటే తదుపరి చిత్రం 75 వ సినిమా. దీంతో తన తదుపరి చిత్రాన్ని భారీగా ఉండాలని వెంకటేష్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా వెంకటేష్ నుండి ఎటువంటి కమర్షియల్ సినిమాలు విడుదల కాలేదు. దీంతో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి వెంకటేష్ ప్రయత్నిస్తున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వెంకీ కెరీర్ లో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలోని మాటలు, కథ-కథనం చాలా వైవిధ్యంగా ఉండటంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.

దీనికి ప్రధాన కారణం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ – విక్టరీ వెంకటేష్ కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో త్రివిక్రమ్ తెరకెక్కించిన అజ్ఞాతవాసి సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్లో నటించారు. తాజాగా సురేష్ బాబు వెంకటేష్ కి ఓ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. వెంకీ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడ్డారు అంట. అల వైకుంఠపురం సినిమాతో భారీ విజయం సాధించడంతో త్రివిక్రమ్ మంచి జోరుమీద ఉన్నాడు. మరోవైపు ఎన్టీఆర్ సినిమా ఇప్పట్లో తెరకెక్కే అవకాశం కూడా లేదు . దీంతో వీరి కలయికలో మరో సినిమా వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వెంకటేష్ కోసం ఇప్పటికే త్రివిక్రమ్ ఓ కథను రెడీ చేశారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లో రానుంది. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad