
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ కారణంగా అన్ని రంగాలు మూతపడటంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినీ రంగానికి చెందిన అనని కార్యక్రమాలు కూడా నిలిచిపోయాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద రిలీజ్ కావాల్సిన చిత్రాలు అన్నీ కూడా వాయిదా పడ్డాయి. దీంతో సినిమా రంగానికి భారీ నష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే థియేటర్లు మూతపడటంతో సినిమాల రిలీజ్లు వాయిదా పడ్డాయి.
అయితే కేవలం కరోనా సమయంలో సినిమాల రిలీజ్ విషయంలోనే కాకుండా భవిష్యత్తులో సినిమాలను రిలీజ్ చేసే విషయంలోనూ చిత్ర వర్గాలు చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. కాగా భారీ బడ్జెడ్ చిత్రాలను తెరకెక్కి్స్తున్న నిర్మాణ సంస్థలు, థియేటర్లు తెరుచుకున్న తరువాతే తమ సినిమాలను రిలీజ్ చేయాని చూస్తున్నాయి. అయితే థియేటర్లు తెరుచుకున్న తరువాత కూడా ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది.
దీంతో నిర్మాతలు రిలీజ్ విషయంలోనే కాకుండా తమ సినిమాలకు కేటాయించే బడ్జెట్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా టీ-సిరీస్ లాంటి సంస్థలు తమ సినిమా బడ్జెట్లను చాలా జాగ్రత్తగా కేటాయిస్తూ అనసవర ఖర్చులకు ఫుల్స్టాప్ పెట్టాలని చూస్తోంది. కరోనా ప్రభావంతో హలీవుడ్లోనూ అవతార్ వంటి చిత్రాలు కూడా అయోమయంలో పడ్డాయి. ఏదేమైనా కరోనా ప్రభావంతో సినీ రంగంలో చాలా మార్పులు చోటుచేసుకోనున్నాయనే విషయం స్పష్టం అవుతోంది.