
కరోనా దెబ్బ సామాన్యుల నుండి సెలబ్రిటీలు వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.తాజాగా ఇచ్చిన మినహాయింపులతో కొన్ని చిన్న చిత్రాల షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ ……అవి కొద్దిరోజులకే ఆగిపోయాయి. ప్రస్తుతం కరోనా ఉధృతి ఎప్పుడు తగ్గుతుందా అని అందరూ….. ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఆర్మాక్స్ మీడియా టాలీవుడ్ పాపులర్ 10 హీరో లిస్ట్ ను విడుదల చేసింది. ఆ లిస్ట్ లో ఉన్న హీరోస్ ఎవరో తెలుసుకుందాం. గత సినిమా హిట్లు, తాజాగా కొట్టిన హిట్లను బట్టి ఈ సంస్థ టాప్ టెన్ హీరోల లిస్ట్‌ను రిలీజ్ చేసింది.
ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంది ప్రిన్స్ మహేశ్‌బాబు. అందరికీ నష్టాన్ని మిగిల్చిన 2020 సంవత్సరం మొదట్లోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ అందుకున్నారు మహేశ్. దీంతో జాబితాలో అగ్రస్థానంలో నిలవగలిగారు. ఇక ఆ తర్వాత స్థానంలో అల్లుఅర్జున్ నిలిచారు. మహేష్ బాబు తో సంక్రాంతి బరిలో దిగిన బన్నీ…… అల వైకుంఠపురములో చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం బన్నీ తన మిత్రుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రంలో బిజీగా ఉన్నాడు. ఇక మూడో స్థానంలో టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ ఉన్నారు. బాహుబలి చిత్రంతో దేశమంతా ఫ్యాన్స్ ను సంపాదించుకున్న ప్రభాస్….. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ చిత్ర రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక నాల్గవ స్థానంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉన్నారు. రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ ……ఇప్పుడు పింక్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ అయిన పాట యూట్యూబ్ లో సంచలనమయ్యింది. మగువా మగువా అనే సాంగ్ కోట్లాది మందిని రంజింపజేసింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఐదవ స్థానాన్ని మెగాస్టార్ చిరంజీవి దక్కించుకున్నారు. సైరా నరసింహారెడ్డి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న చిరంజీవి… ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాను చేస్తున్నాడు.ఇందులో ఆయనకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.
ఇక చిరంజీవి తర్వాతి స్థానాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ దక్కించుకున్నారు. ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్‌కు దగ్గరగా ఉన్నాడు. ఆయన నటించిన గత ఐదు చిత్రాలు విజయాలు సాధించాయి. ఆర్ ఆర్ ఆర్ కూడా హిట్ అయ్యింది డబుల్ హ్యాట్రిక్ కొట్టినట్టే. ఇక ఏడవ స్థానాన్ని నేచురల్ స్టార్ నాని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటుడు సుధీర్‌బాబుతో కలిసి ఇంద్రకంటి మోహనకృష్ణ డైరెక్షన్లో వీ అనే చిత్రంలో నటించారు. ఆ సినిమా కోసం నాని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మొదట ఈ చిత్రం ఓటిటి ప్లాట్ ఫారం లో రిలీజ్ అవ్వడానికి……రెడీ అవుతుందని ప్రచారం జరిగింది. కాని దీన్ని చిత్ర టీం తోసిపుచ్చింది. ఇక ఎనిమిదవ స్థానంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిలబడ్డారు. 2019లో రంగస్థలంతో మంచి హిట్ అందుకున్నాడు చెర్రీ. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో చేస్తున్నాడు.అలాగే ఆచార్య చిత్రంలో ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడు.ఇక 9వ స్థానంలో టాలీవుడ్ రౌడీ బొయ్ విజయ్ దేవరకొండ ఉన్నారు. అర్జున్ రెడ్డి చిత్రంతో మనోడు బాగా ఫేమస్ అయిపోయాడు. ప్రస్తుతం విజయ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు.
ఇక పదవ స్థానంతో సరిపెట్టుకున్నాడు ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేశ్. 2020లో వెంకీమామగా అలరించిన వెంకటేష్…ఇప్పుడు తమిళ హిట్ మూవీ అసురన్ రీమేక్ నారప్పలో నటిస్తున్నారు. ఇందులో వెంకటేష్ కు జోడిగా ప్రియమణి నటిస్తుంది. ఇలా ఆయా హీరోల ఫ్యాన్ ఫాలోయింగ్, గత చిత్రాల విజయాలు, తాజా హిట్లన్నీ బేరీజు వేసుకుని…..ఈ సర్వే చేశారు. ఇక ఈ సర్వే టాప్ టెన్ లిస్ట్ చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. కొందరు ఈ జాబితా తప్పని అంటుంటే…మరికొందరు మాత్రం ఎగ్జాట్‌గా ఉందని చెప్పుకొస్తున్నారు.