Home సినిమా హీరోయిన్ చనిపోయిన ఇన్నేళ్లకు.. ఆమె మృతి పై మళ్లీ ..!

హీరోయిన్ చనిపోయిన ఇన్నేళ్లకు.. ఆమె మృతి పై మళ్లీ ..!

పద్దెనిమిది సంవత్సరాల వయస్సులోనే బాలీవుడ్లో, టాలీవుడ్లో, కోలీవుడ్లో స్టార్ కథానాయకుల పక్కన నటించిన భామ దివ్య భారతి. పందొమ్మిది సంవత్సరాలకే మృత్యువాత పడింది. కొందరు ద్యివభారతి ఆత్మహత్య చేసుకుందని, మరికొందరు హత్యని, ఇంకొందరు ఎక్కవగా తాగి పై నుండి క్రింద పడి చనిపోయిందని చెప్తుంటారు. ఆమె చనిపోయిన ఇన్ని సంవత్సరాల తరువాత జాతీయ మీడియా సంస్థ ఆమె మరణము పట్ల కథనాన్ని వెల్లడించింది.

ఫిబ్రవరి 25వ తేదీన దివ్యభారతి పుట్టిన రోజు జరగగా, ఆమె మరణము పట్ల మీడియా సంస్థ కొన్ని కొత్త కథనాలను వెలువరించింది. ఈ కథనం ప్రకారం కొత్త విషయాలు బయటకొచ్చాయి. ఆమె మరణించిన రోజు ఏం అయింది ?ఆమె మరణానికి ముందుగా ఎవరిని కలిసింది? ఎవరితో మాట్లాడింది? ఇలాంటి విషయాలను మీడియా తెలుసుకుంది. దివ్య భారతి మరణ విషయమై తండ్రి వివరిస్తూ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి లేదు. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన మాత్రమే అంటూ కన్నీళ్లు పెట్టాడు.

చెన్నైలో షూటింగ్ పూర్తయ్యాక దివ్య భారతి ముంబయిలో ఉన్న ఆమె ఇంటికి వెళ్ళింది. ఆమె అపార్టుమెంట్ కి చేరుకున్న కొంత టైమ్ కి నీతా లుల్లా ఫోన్ చేశారు. దివ్య భారతి చేస్తున్న సినిమా లో కాస్ట్యూమ్స్ గూర్చి మాట్లాడుకొనుటకు, ఇంటికి రమ్మని దివ్య అడగగా నీతాలుల్లా, ఆమె భర్త ఇద్దరు కలిసి వచ్చారట. వారు ఆ విషయం పట్ల చర్చ జరుపుతూ, మందు పార్టీ చేసుకున్నారు. వంట ఆవిడ ఇచ్చిన స్నాక్స్ తిన్నారు.

కొంత సమయము గడిచాక దివ్యభారతి బాల్కానీ లో కూర్చుంది. మత్తులో ఉన్న ఆమె అక్కడి నుండి ప్రమాదవశాత్తుగా జారి పడిపోయింది. అపార్ట్ మెంట్ లో ప్లాట్స్ మొత్తానికి గ్రిల్స్ ఉన్నాయి. కానీ దివ్య భారతి ప్లాట్ బాల్కనీకి గ్రిల్స్ లేవని, గ్రిల్స్ ఉంటే బ్రతికి ఉండేది అని బాధ పడ్డారు. చివరగా చిన్న వయస్సులోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె చిన్నవయస్సులోనే మృత్యు వాత పడింది. నటించిన వరకైనా తనకంటూ ఇమేజ్ సంపాదించుకొని ఎందరో కథానాయికలకు ఆదర్శంగా ఉందని చెప్పవచ్చు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad