Home టాప్ స్టోరీస్ భయంతో వణికిపోతున్న ప్రొడ్యూసర్లు

భయంతో వణికిపోతున్న ప్రొడ్యూసర్లు

tollywood logo

ప్రస్తుతం టాలీవుడ్ ప్రొడ్యూసర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. షూటింగ్ జరుపుకొని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న థియేటర్లు లేక నానా కష్టాలు పడుతున్నారు. సినిమా కోసం తీసుకొచ్చిన వడ్డీలు ప్రొడ్యూసర్లు నడ్డి విరుస్తున్నాయి. అయితే దీని కంటే అత్యంత ప్రమాదకరమైన మరో విషయం ఇంకొకటి ఉందంటు టాలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం థియేటర్లు మూతబడి ఉండటంతో మెజారిటీ సినిమాలు ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నాయి. చిన్న మధ్య తరహా సినిమాలకు ఓటీటీ మంచి వేదికగా తయారైంది. ప్రేక్షకులు కూడా ఇంటి వినోదాన్నే కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయం ప్రొడ్యూసర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుంది.

మొదటి నుండి టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఓటీటీ వ్యతిరేకంగా ఉన్నారు. అల వైకుంఠపురంలో సినిమా విడుదలైనప్పుడు ఈ సినిమాను ఓటీటీ మరియు ఏ ఇతర ప్లాట్ ఫామ్ కు అందించమని సదరు నిర్మాతలు అన్నారు. సినిమాల విడుదల అంశంపై సురేష్ ప్రొడక్షన్స్, గీత ఆర్ట్స్ దీని మీద ఓ తీర్మానం కూడా చేసింది. అయితే అనూహ్యంగా సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత  అల వైకుంఠపురంలో చిత్రం నెట్ ఫ్లిక్ష్ లో దర్శనమివ్వటంతో ప్రేక్షకులు షాక్ కు గురయ్యారు. డిజిటల్ ప్లాట్ ఫామ్ కు అడ్డుకట్ట వేయడానికి ప్రొడ్యూసర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడటం లేదు. ప్రస్తుతం కరోనా విజృంభణ కొనసాగుతుండటం, థియేటర్లు మూతబడి ఉండటంతో ప్రేక్షకులు పూర్తిగా ఓటీటీకి అలవాటు అయ్యారు.

ప్రతి సగటు ప్రేక్షకుడు వద్ద ఇంటర్నెట్, మొబైల్ ఉండటంతో ఎక్కువ మంది వీటిపై మక్కువ చూపిస్తున్నారు. దీంతో మెల్లమెల్లగా థియేటర్ కు వెళ్లాలనే ఆలోచన ప్రేక్షకుల మెదడు నుండి తుడుచుకోపోతున్నట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు సగటున ప్రతి 10 మందిలో ఆరుగురు థియేటర్ కి వచ్చేవారు. కానీ ఓటీటీ ప్రభావంతో భవిష్యత్తులో ఈ సంఖ్య సగానికి సగం పడిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సూచనలు కనిపిస్తుండటంతో ప్రొడ్యూసర్లు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ప్రేక్షకులు థియేటర్ కు రారేమోనని సినీ ఇండస్ట్రీ అనుకుంటుంది. సమీప భవిష్యత్తులో ఓటీటీ మరియు థియేటర్ల మధ్య భీకర యుద్ధం జరగనుంది. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో కాలమే నిర్ణయిస్తుంది. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad