Home టాప్ స్టోరీస్ మహేష్ తో జత కడుతున్నత్రివిక్రమ్? ఇంతకీ ఇది నిజమేనా!

మహేష్ తో జత కడుతున్నత్రివిక్రమ్? ఇంతకీ ఇది నిజమేనా!

thumb 14

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా త్రివిక్రమ్ – మహేష్ బాబు కలయికలో వచ్చిన చిత్రాలన్నీ మంచి విజయాన్ని సాధించాయి. వీరి కలయికలో మరోసారి సినిమా రావాలని సగటి తెలుగు ప్రేక్షకుడి కళ. వీరిద్దరి కాంబినేషన్ లో ఏదో మ్యాజిక్ ఉంది. అతడు సినిమాతో మహేష్ కు మాస్ ఇమేజ్ ను తెచ్చి పెట్టిన త్రివిక్రమ్, ‘ఖలేజా’తో మహేష్ లో ఉన్న కామెడీ యాంగిల్ ను బయటకు తీసుకు వచ్చాడు.ఈ సినిమా భారీ విజయాన్ని సాధించక పోయినప్పటికీ కల్ట్ క్లాసిక్ గా మిగిలింది. ఆ తర్వాత నుండి వీరి కలయికలో ఇప్పటివరకు మరో సినిమా రాలేదు.

అల వైకుంఠపురంలో సినిమా విజయం సాధించడంతో  త్రివిక్రమ్ మంచి ఊపు మీద ఉన్నాడు. మహేష్ సరిలేరు నీకెవ్వరు భారీ విజయం అందుకోవడంతో ప్రిన్స్ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇప్పుడు వీరి కలయికలో సినిమా వస్తే బాక్సాఫీస్ వసూళ్ళు బద్దలు కావడం ఖాయం. తాజా సమాచారం ప్రకారం వీరి కలయికలో ఓ సినిమా రానుందని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి మరికొన్ని రోజుల్లో స్టోరీ డిస్కషన్స్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే స్టోరీ లైన్ ను డెవలప్ చేసిన త్రివిక్రమ్ మహేష్ కు వినిపించనున్నారట.

సర్కారు వారి పాట సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమాను పట్టాలేక్కించే అవకాశం ఉంది. ఎన్టీఆర్‌తో అనుకున్న సినిమా లేట్ అయ్యే అవకాశం ఉండటంతో మహేష్‌తో వేగంగా ఒక సినిమా పూర్తి చేసేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేసారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లో వెలువడనుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు అయినను అయిననూ పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు మహేష్ సర్కారువారి పాట డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad