Home సినిమా టాలీవుడ్ న్యూస్ శ్రీదేవి కూతురిని పక్కకునెట్టిన కియారా!

శ్రీదేవి కూతురిని పక్కకునెట్టిన కియారా!

Kiara Advani In Talks For NTR Trivikram Movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే తారక్ తన కెరీర్‌లో 30వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేశారు.

అయితే ఈ సినిమాలో తారక్ సరసన హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలా అనే ప్రశ్న త్రివిక్రమ్‌ను వెంటాడుతోంది. ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న పూజా హెగ్డే, త్రివిక్రమ్‌తో ఇప్పటికే రెండు, తారక్‌తో ఒక సినిమా చేసింది. దీంతో మరోసారి ఆమెను తీసుకుంటే ప్రేక్షకులకు నచ్చకపోవచ్చని వారు భావిస్తున్నారు. ఇక టాలీవుడ్‌లో రష్మిక మందన ప్రస్తుతం పుష్ప చిత్రంతో బిజీగా ఉండటంతో త్రివిక్రమ్ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను ఈ సినిమాలో తీసుకోవాలని భావించాడు. కానీ ఆమెను నేరుగా తారక్ లాంటి స్టార్ హీరో చిత్రంలో తీసుకుంటే ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతుందో లేదో అనే ఆలోచనలో పడ్డాడు.

దీంతో టాలీవుడ్ జనాలకు బాగా తెలిసిన హీరోయిన్ కియారా అద్వానీని ఈ సినిమాలో తీసుకుంటే బాగుంటుందని చిత్ర వర్గాలు అనుకుంటున్నాయి. అటు తారక్ పక్కన ఈ బ్యూటీ అయితే చూడటానికి కూడా బాగుంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అభిప్రాయ పడుతుండటంతో త్రివిక్రమ్ ఆమెను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడట. మొత్తానికి టాలీవుడ్‌లో ఎన్టీఆర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వాలని భావించిన జాన్వీ కపూర్‌కు కియారా అద్వానీ చెక్ పెట్టిందని సినీ క్రిటిక్స్ అంటున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad