Home సినిమా టాలీవుడ్ న్యూస్ చిచ్చు రాజేస్తున్న కొరటాల : మెగా ఫాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్

చిచ్చు రాజేస్తున్న కొరటాల : మెగా ఫాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్

PicsArt 08 03 11.27.48

టాలీవుడ్ లో అతి పెద్ద ఫ్యామిలీలో మెగా ఫ్యామిలీ ఒకటి. మెగా ఫ్యామిలీలో దాదా డజను మంది సినీ నటులు ఉన్నారు . అటు అల్లు ఫ్యామిలీలో అల్లు రామలింగయ్య వారసత్వాన్ని అందుకున్న ఏకైక నటుడు అల్లు అర్జున్. టాలీవుడ్ లో మెగా కుటుంబం అంటేనే అల్లు ఫ్యామిలీ అని ఒక మంచి అభిప్రాయం ఉంది.

మెగా ఫ్యామిలీ నుండి చిరు ఆ కుటుంబాన్ని నడిపిస్తుండగా, అల్లు ఫ్యామిలీను అల్లు అరవింద్ నడిపిస్తున్నారు. అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ బ్యానర్ ను నెలకొల్పి,సౌత్ ఇండియాలోని అతి పెద్ద ప్రొడ్యూసర్ గా అవతరించారు. ఇక్కడ వరకు అంతా మంచిగానే ఉన్నప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా మెగా ఫ్యామిలీ మరియు అల్లు ఫ్యామిలీ కి మధ్య మనస్పర్థలు వచ్చాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆడియో ఫంక్షన్ లో జరిగే వివాదాలు ఈ గొడవలకు ఆజ్యం పోస్తున్నయన్నది అందరికీ తెలిసిన సత్యం . ఒక ఆడియో ఫంక్షన్ లో అల్లు అర్జున్ పవర్ స్టార్ గురించి మాట్లాడ మంటే “ నేను మాట్లాడను బ్రదర్” అంటూ మెగా ఫాన్స్ కు షాక్ ఇచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై విరుచుకు పడటం మొదలు పెట్టారు. ఇది ఏ స్థాయికి చేరిందంటే అల్లు అర్జున్ సినిమా వస్తుందంటే చాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బన్నీ సినిమాకు డిస్ లైక్ లో వర్షం కురిపిస్తున్నారు.

ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. ఇప్పుడు మరొక వివాదం ఏకంగా ఈ రెండు కుటుంబాల మధ్య వైరానికి నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లో కొరటాల శివ ఒకరు. జనతా గ్యారేజ్,శ్రీమంతుడు, భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ హిట్టు యమ జోరు లో ఉన్నాడు. చిరు కొరటాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధంతో ఇప్పుడు కొరటాల చిరుతో “ఆచార్య” అనే సినిమాను ఇస్తున్నాడు. తాజాగా ఈ దర్శకుడు తన తర్వాతి సినిమాను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు ఇదే అంశం టాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఎందుకంటే ? మొదట ఈ సినిమా కధను కొరటాల రామ్ చరణ్ కు చెప్పారంట అయితే తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ హఠాత్తుగా ఈ కధ అల్లు అర్జున్ కి షిఫ్ట్ కావడం, అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ రావడంతో రామ్ చరణ్ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. కధ ఇంకా చర్చల దశలో ఉండగానే ఎలా అనౌన్స్ మెంట్ చేస్తారని మెగా ఫ్యామిలీ అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మెగా స్టార్ కొరటాల పై అసహనం వ్యక్తం చేస్తున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ ఫామిలీ గొడవల మధ్యలో కొరటాల చిక్కుకున్నాడన్నది వాస్తవం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad