
కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం ఎలాంటి విజమాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో కన్నడ హీరో యశ్ ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ను సాధించుకున్నాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయడంతో ఆయన మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇక కేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. హీరోయిజంను ఎలివేజ్ చేయడంలో ఈ సినిమా మరో లెవెల్‌కు వెళ్లడంతో మాస్ ప్రేక్షకులు ఈ సినిమాను భీబత్సంగా ఆదరించారు.
అయితే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత టాలీవుడ్లో తన సత్తా చూపాలని ఉవ్విల్లూరుతున్నాడు ఈ డైరెక్టర్. కాగా ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు ఈ డైరెక్టర్ రెడీ అవుతున్నాడు. అటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ఓ సినిమా చేస్తాడని, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు ఓ కథను వినిపించాడని పలు వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయం పక్కనబెడితే, తెలుగు హీరోలు ఈ డైరెక్టర్‌తో సినిమా చేయాలని ఉత్సాహంగా ఉన్నారనేది మాత్రం వాస్తవం.
మరి ఈ డైరెక్టర్‌కు అంత ప్రాముఖ్యత మన తెలుగు హీరోలు ఎందుకు ఇస్తున్నారు? మన దగ్గర అలాంటి డైరెక్టర్ లేడా? అనే ప్రశ్న తెలుగు ఆడియెన్స్‌ను వెంటాడుతోంది. ఏదేమైనా ఈ డైరెక్టర్ టాలీవుడ్ ఎంట్రీ కేజీఎఫ్ సీక్వెల్ చిత్రం రిజల్ట్‌పై ఆధారపడి ఉంది. ఆ సినిమా కూడా మొదటి భాగంలాగా సూపర్ హిట్ అయితేనే ఈ డైరెక్టర్న తెలుగు హీరోలు ప్రిఫర్ చేస్తారు. ఒకవేళ ఆ సినిమా కొంచెం తేడా కొట్టినా ఈ డైరెక్టర్‌ను తెలుగు హీరోలు కనీసం పట్టించుకోవడం కూడా చేయరు. మరి ఈ డైరెక్టర్‌కు నిజంగా అంత సత్తా ఉందో లేదో కేజీఎఫ్ చాప్టర్ 2 సక్సెస్‌తో తెలిసిపోతుంది.