Home సినిమా టాలీవుడ్ న్యూస్ ఈ క‌మెడియ‌న్స్ ఎక్కడివారో తెలుసా....

ఈ క‌మెడియ‌న్స్ ఎక్కడివారో తెలుసా….

brahmi thumb

మ‌న‌కు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది క‌మెడియ‌న్స్ ఉన్నారు. కొంద‌రు కాలం చేశారు. మ‌రికొంద‌రు ఇంకా త‌మ కామెడీ కిత‌కిత‌ల‌ను పెడుతూనే ఉన్నారు. ర‌మ‌ణారెడ్డి , రాజబాబు నుంచి నేటి ర‌ఘుబాబు, స‌త్య వ‌ర‌కు అంద‌రూ అంద‌రే. ఎవ‌రి స్టైల్ వారిదే. ఎవ‌రికీ ఎవ‌రో తీసిపోని విధంగా ….వెండితెర‌పై న‌వ్వులు పండిస్తుంటారు. వారి న‌వ్వుల‌ను ఎంత‌గానో ఆస్వాదించే మ‌నం …వారు ఎక్క‌డి నుంచి వ‌చ్చారు…ఆయా హాస్య‌కళాకారుల స్వ‌గ్రామం ఎక్క‌డా అనేది చాలా మందికి తెలియ‌దు. అందుకే అలాంటి క‌ళాకారులు ఎక్క‌డెక్క‌డ నుంచి వ‌చ్చారో వివ‌రిస్తున్నాం. వీరిలో మొద‌టి బ్ర‌హ్మానందం. ఈయ‌న పూర్తి పేరు క‌న్నెగంటి బ్ర‌హ్మానందం. గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ముప్ప‌ళ్ల మండ‌లం చాగంటివారి పాలెంలో జ‌న్మించారు. న‌రేష్ న‌టించిన శ్రీతాతా అవ‌తారంలో హీరోకి న‌లుగురు స్నేహితుల్లో ఒకడిగా న‌టించారు. రిలీజైన తొలి సినిమా మాత్రం జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆహ నా పెళ్లంట‌. ఆ సినిమాలో బ్ర‌హ్మీ పోషించిన అర‌గుండు పాత్ర జ‌నాల‌తో న‌వ్వులు పూయించింది. ఆ త‌ర్వాత వెనుదిరిగి చూసుకోలేదు మ‌న హాస్య‌బ్ర‌హ్మ‌. ఇప్ప‌టికీ త‌న‌దైన శైలిలో న‌టిస్తూ హాస్య‌బ్ర‌హ్మ‌గా గుర్తింపు పొందారు. ఆ త‌ర్వాత హాస్య‌న‌టుడు ధ‌ర్మ‌వ‌ర‌పు బ్ర‌హ్మానందం. ఈయ‌న ప్ర‌కాశం జిల్లాలోని బ‌ల్లికుర‌వ మండ‌లంలోని కొమ్మినేనివారిపాలెం గ్రామంలో జ‌న్మించారు. ఈయ‌న‌ది వ్య‌వ‌సాయ కుటుంబం. దూర‌ద‌ర్శ‌న్‌లో ప్రారంభ‌మైన ఆనందోబ్ర‌హ్మో కార్య‌క్ర‌మంతో మంచి ప్ర‌చుర్యం పొందారు. జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా సినిమాతో……టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత వందలాది చిత్రాల్లో న‌టించి మెప్పించారు. ఆ త‌ర్వాత చెప్పుకోద‌గ్గ మ‌రో హాస్య‌న‌టుడు ఆలీ. ఈయ‌న తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండిలో జ‌న్మించారు. సీతాకోక‌చిలుక సినిమాతో బాల‌న‌టుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఇప్ప‌టివ‌ర‌కు 800ల‌కుపైగా సినిమాల్లో న‌టించారు.

ఆ త‌ర్వాత మ‌రో హాస్య న‌టుడు ఎంఎస్ నారాయ‌ణ‌. ముద్దుగా అంద‌రూ ఎంఎస్ అని పిలుస్తుంటారు. ఈయ‌న పూర్తి పేరు మైల‌వ‌ర‌పు సూర్య‌నారాయ‌ణ‌. ప్ర‌ముఖ హాస్య‌న‌టుడే కాదు ద‌ర్శ‌కుడు కూడా. ఈయ‌నది ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని నిడ‌మర్రు గ్రామం. వీరిది రైతు కుటుంబం. దాదాపు 700 చిత్రాల్లో న‌టించి మెప్పించారు. చాలా త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ సినిమాలు చేసి న‌టుడు ఎంఎస్ నారాయ‌ణే. మ‌రో హాస్య‌న‌టుడు సుధాక‌ర్‌. ప్ర‌ధాన న‌టుడిగా, హాస్య‌నటుడిగాను తెలుగు,త‌మిళ చిత్రాల్లో న‌టించి మెప్పించారు. క‌ర్నూలు జిల్లా బ‌న‌గానప‌ల్లెకు …..కేవ‌లం 15 కిలోమీట‌ర్ల దూరంలోని కోయిల‌కుంట్ల‌లో పుట్టారు. తెలుగులో ఈయ‌న తొలి సినిమా సృష్టి ర‌హ‌స్యాలు. చిరంజీవికి సుధాక‌ర్ మంచి మిత్రుడు. ఒకేసారి ఇండ‌స్ట్రీలో కి అడుగుపెట్టారు. ఆ త‌ర్వాత చెప్పుకోద‌గ్గ న‌టుడు రేలంగి . ఈయ‌న పూర్తి పేరు రేలంగి వెంక‌ట‌రామ‌య్య‌. వెండితెర‌కు స్వ‌ర్ణ యుగంలాంటి రోజుల్లో ప్ర‌జ‌ల గుండెతెర‌ల‌పై న‌వ్వుల న‌యాగారంగా ఉప్పొంగిన హాస్య‌గంగ ఈయ‌న‌. తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ‌కు 75 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న రావుల‌పాలెం గ్రామంలో రేలంగి జ‌న్మించారు. ఆ త‌ర్వాత చెప్పుకోద‌గ్గ మ‌రో న‌టుడు అల్లు రామ‌లింగ‌య్య‌. ఈయ‌న‌ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లులో పుట్టారు. ఈయ‌న హాస్యం మూడు త‌రాల సినీప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. చిత్ర‌సీమ‌లో తొలిసారిగా 1952లో పుట్టినిల్లు అనే చిత్రంతో ప‌రిచ‌యం అయ్యారు. వంద‌లాది చిత్రాల్లో న‌టించి మెప్పించారు. చిరంజీవికి పిల్ల‌నిచ్చి మెగాస్టార్ మామ అయ్యాడు. ఇండ‌స్ట్రీలో పెద్ద నిర్మాత‌గా ఉన్న అల్లు అర‌వింద్….రామ‌లింగ‌య్య కుమారుడే. చిత్ర‌సీమలో రెండు ద‌శాబ్దాల పాటు ప్ర‌ముఖ హాస్య‌న‌టుడిగా వెలిగిన రాజాబాబు. శ‌తాబ్దపు హాస్య‌న‌టుడిగా ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఈయ‌న‌ది ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురంలో జ‌న్మించారు. రాజాబాబు మొద‌టి సారి తెర‌పై క‌నిపించిన సినిమా స‌మాజం. రాజాబాబు హాస్యాన్ని న‌చ్చ‌ని వ్య‌క్తి ఉండ‌రు అంటే అతిశ‌యోక్తి కాదేమో. ఆ స్థాయిలో న‌టించి మెప్పిస్తుంటారు. మ‌‌రో హాస్య‌న‌టుడు ప‌ద్మ‌నాభం. క‌డ‌ప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జ‌న్మించారు. మాయాలోకం సినిమాలో కోర‌స్ పాడ‌ట‌మే కాదు…అందులో న‌టించే అవ‌కాశం కూడా వ‌చ్చింది. ఆ త‌ర్వాత వంద‌లాది చిత్రాల్లో న‌టించి త‌న‌దైన ముద్ర వేశారు. మ‌రో హాస్య‌న‌టుడు న‌గేశ్‌. ద‌క్షిణ‌భార‌త చ‌ల‌న‌చిత్ర రంగంలో ప్ర‌సిద్ధ హాస్య‌న‌టుడు ఈయ‌న‌. త‌మిళ‌, తెలుగు, క‌న్న‌డ , మ‌ల‌యాళ భాషల్లో …వెయ్యి చిత్రాల్లోపైగా న‌టించి సినీజ‌నాన్ని రంజింప‌జేశారు. ఈయ‌నది క‌ర్ణాట‌క‌. బెంగ‌ళూరు న‌గ‌రానికి 70 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టుమ్కూరు స‌మీపంలోని చేయ్యూరు గ్రామంలో పుట్టారు.

ఇక మ‌రో చెప్పుకోద‌గ్గ న‌టి సూర్యాకాంతం. ఈమ‌ తెలియ‌ని వారు ఎవ‌రూ ఉండ‌రేమో. ఈవిడ తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ ద‌గ్గర ఉన్న వెంక‌ట‌కృష్ణ‌రాయ‌పురం గ్రామంలో జ‌న్మించారు. మొద‌టిసారి నార‌ద నార‌ద అనే సినిమాలో స‌హాయ‌న‌టిగా అవ‌కాశం వ‌చ్చింది. ఆ త‌ర్వాత వంద‌లాది సినిమాల్లో న‌టించింది. గ‌య్యాలి అత్త పాత్ర‌ల‌కు పెట్టింది పేరు. ఆ త‌ర్వాత చెప్పుకోద‌గ్గ మ‌‌రో న‌‌టి ర‌మాప్ర‌భ‌. ద‌క్షిణ‌భార‌త చ‌ల‌న‌చిత్ర సీమలో ప్ర‌ముఖ హాస్య‌న‌టిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈవిడ అనంత‌పురం జిల్లా పుట్ట‌ప‌ర్తి స‌మీపంలోని క‌దిరిలో జ‌న్మించారు. ఇప్ప‌టివ‌ర‌కు 14 వంద‌ల‌కుపైగా చిత్రాల్లో న‌టించి మెప్పించారు. హాస్య‌న‌టుల్లో చెప్పుకోద‌గ్గ‌ర మ‌రో న‌టుల్లో ఒక‌రు సుత్తివేలు. త‌న సుత్తితో ఏపీ ప్ర‌జ‌ల‌ను రెండు ద‌శాబ్దాలుగాపైగా న‌వ్వించారు ఈయ‌న‌. కృష్ణా జిల్లా విజ‌య‌వాడ‌కు 70 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న బోగిరెడ్డిప‌ల్లె గ్రామంలో జ‌న్మించారు. ముద్ద మందారం అనే చిత్రంతో తెలుగుతెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. అయిన‌ప్ప‌టికీ జంధ్యాల ర‌చించిన నాలుగు స్థంభాల‌ట చిత్రంలో …..ఆయ‌న పోషించిన సుత్తి పాత్ర‌కు మంచి పేరు వ‌చ్చింది. కామెడీని పండించ‌డంలో త‌న‌దైన ముద్ర వేసిన మ‌రో నటుడు సుత్తి వీర‌భ‌ద్ర‌రావు. హాస్య‌బ్ర‌హ్మా జంధ్యాల ప‌రిచ‌యం చేసిన సుత్తి వీర‌భ‌ద్ర‌రావు గోదావ‌రి జిల్లాల్లో పుట్టిన‌ప్ప‌టికీ…స్వ‌స్థ‌లం విజ‌య‌వాడ‌గానే మారిపోయింది. ఎన్నో మ‌రుపురాని సినిమాల్లో న‌టించి త‌న‌దైన హాస్యాన్ని పండించారు ఈయ‌న‌.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad