‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ’ హిట్ సాధించకపోవడంతో లాంగ్ గ్యాప్ తీసుకొని అల్లుఅర్జున్ 19 వ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు ఓకే చెప్పాడు. స్టైలీష్ స్టార్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాను ఈరోజు (శనివారం) ప్రారంభించారు. త్రివిక్రమ్ తో కలిసి మూడో సినిమాను బన్నీ చేయబోతున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు. వారందరి సమక్షంలో ఎంతో ఘనంగా కార్యక్రమం జరిగింది .
హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో పూజా హెగ్డే అల్లుఅర్జున్ తో మరో సారి జోడి కడుతుంది. ఈ సినిమాకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని, థమన్ సంగీతమందిస్తున్నాడు. బన్నీ, థమన్ లకు కూడా ఇది రెండో మూవీ. ఈ సినిమాతో పాటు సుకుమార్ దర్శకత్వములో రాబోతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టారు బన్నీ. ఈ సంవత్సరానికి గాను మూడు సినిమాలతో బిజీగా ఉన్న స్టైలిష్ స్టార్.. రెండు సినిమాల పనులను ఈరోజే మొదలు పెట్టేసారు.