Home సినిమా టాలీవుడ్ న్యూస్ పవన్ సీక్రెట్ బయటపడింది

పవన్ సీక్రెట్ బయటపడింది

1344e18943282d664284fff8b002882d

మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ ఒక హీరో అయినప్పటికీ వారు ఆయన కుటు౦బం సభ్యులకు చెందిన ఎటువంటి శుభకార్యాలకు మరియు ఫంక్షన్స్ కు హాజరుకారని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతూ వస్తోంది. దీనికి సంబంధించి అనేక సంఘటనలు బలం చేకూర్చేయి కూడా. పవన్ ఏనాడూ మెగా ఫ్యామిలీకి చెందిన ఆడియో ఫంక్షన్లకు హాజరు కాకపోవడం వారితో కలిసి మెలిసి వుండకావుపోవడంతో మెగా ఫ్యామిలీ నుండి పవన్ కళ్యాణ్ దూరమవుతున్నారు అంటూ వార్తలు జోరుగా ప్రచారం సాగాయి. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థ వేడుక అట్టహాసంగా జరిగింది.ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి నుంచి వైష్ణవ్ తేజ్ వరకు అందరు వచ్చారు ఒక్క పవన్ తప్ప. పవన్ నిశ్చితార్థ వేడుకలు కనిపించకపోవడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూర్చినట్టు అయ్యింది. పవన్ ఈ వేడుకకు హాజరు కాకపోవడానికి గల కారణాల్ని ఇటు మెగా ఫ్యామిలీ కానీ పవన్ కళ్యాణ్ వెల్లడించలేదు.

తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాతుర్మాస దీక్షలో ఉన్నారు. ఈ దీక్ష ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు రాకూడదు అందుకే పవన్ ఈ ఫంక్షన్ కు అటెండ్ కాలేదు.గతంలో నితిన్ పెళ్ళికి హాజరైన అది మధ్యాహ్నం జరిగింది. దీంతో ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయిందని పవన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా దాదాపు 90 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. సినిమా విడుదల చేద్దామనే సమయానికి కరోనా అడ్డకట్ట వేయడంతో సినిమా విడుదలకు బ్రేక్ పడింది. లాక్ డౌన్ తరువాత వకీల్ సాబ్ విడుదలయ్యే అవకాశం ఉంది.    

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad