Home సినిమా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గిఫ్ట్.. రామ్..!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గిఫ్ట్.. రామ్..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న సినిమా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. ఈ సినిమాకి గాను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా రూపొందిస్తున్నారు. పూరి జగన్నాథ్, రామ్ ని ఈ సినిమా లో డిఫరెంట్ లుక్ లో చూపించనున్నారు. రామ్ సరసన న‌భాన‌టేష్, నిధి అగ‌ర్వాల్‌లు కథానాయకురాళ్లుగా నటిస్తున్నారు. ఇప్పటికీ విడుదలైన టైటిల్‌తో పాటు, ఫస్ట్‌లుక్‌లతో ప్రేక్షకులను చాలా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా కి సంబందించిన ప్రమోషన్ షేర్ చేసుకున్నాడు పూరి.

రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరికి గిఫ్ట్ ఇచ్చాడు. అది అలాంటి, ఇలాంటి గిఫ్ట్ కాదు. ప్రపంచంలోనే అత్యంత విలువైన బహుమతిని బహుకరించడాని ట్వీట్ చేసాడు పూరి. అదేంటంటే, కాఫీ గింజల ప్యాకెట్. ఈ కాఫీ గింజల ప్యాకెట్ పేరు ‘కోపీ లువా‌క్‌ ‘. ఈ పేరు తో ‘గూగుల్’ లో వెతకండి. దీని ధర, దీని గురుంచి తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారంటూ, ‘ఇస్మార్ట్‌ శంకర్’.. రామ్‌ నాకిచ్చిన గిఫ్ట్ కాఫీ తాగేస్తున్నాను. అంటూ గిఫ్ట్ ఫొటోని, కాఫీని తాగుతున్న ఫొటోని ట్వీట్ చేసాడు. ఇక ఈ ట్వీట్ పెట్టిన వెంటనే రామ్ స్పందించాడు. తెలంగాణ యాసలో ‘గూగుల్ చేయకండ్రి.. మ్యాటర్ తెలిస్తే దిమాగ్‌ ఖరాబ్‌ ఐతది’ అంటూ, ఎమోజీలను కూడా పెట్టాడు.

ram

నెటిజన్స్ ఊరుకుంటారా? ప్రపంచం లోనే ఖరీదైనదని మరీ చెప్పి రామ్ గిఫ్ట్ ఇచ్చాడు అనగానే ఎంతో ఉత్సాహంగా వెతికేశారు నెటిజన్స్. లువాక్ కాఫీ అర్ధం చూస్తే ఇది ఒక జంతువు పేరు. సుమత్రా దీవుల్లో ఉండే ఆసియన్ పామ్ సివెట్ అనే అనిమల్ పేరు. ఈ కాఫీ పంటని ఇండోనేసియాలో సుమత్రా, జావా, బాలి, సులావెసి వంటి ప్రాంతాల్లో పండిస్తారు. ఇక్కడ కాఫీని కోపి అంటారు కాబట్టి ‘కోపి లూవాక్’ గా పిలుస్తారు. దీని ధర చూస్తే 35 నుండి 85 డాలర్లు ఉంటుందని అంచనా.అయితే మన ఇండియన్ కరెన్సీ లో చూసుకుంటే ఆరువేల రూపాయలు అన్నమాట.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad