Home టాప్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో యువ దర్శకులు: మారిన ట్రెండ్

వెబ్ సిరీస్ లో యువ దర్శకులు: మారిన ట్రెండ్

Praveen Sattaru

ప్రస్తుతం ఇండస్ట్రీలో వెబ్ సిరీస్ లో హవా గట్టిగా నడుస్తుంది. థియేటర్లు అందుబాటులో లేకపోవడం, లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ఎంటర్టైన్మెంట్ కు ఓటీటీ ప్రత్యామ్నాయ వేదికగా తయారైంది. ముఖ్యంగా వెబ్ సిరీస్లకు ఆదరణ భారీగా పెరిగింది. గత కొంత కాలంగా విదేశీ వెబ్ సిరీసులైన మనీ హేస్ట్, కిల్లింగ్ ఇవ్ నెట్ ఫిక్స్ లో దూసుకుపోతున్నాయి. దీంతో మన దర్శక నిర్మాతలు కూడా వెబ్ సిరీసులను  తెరకెక్కించడానికి తహతహలాడుతున్నారు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా – విజయ్ దేవరకొండ కలయికలో ఓ సిరీస్ రానుండగా, పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాష్కర్ దర్శకత్వంలో మరో వెబ్ సిరీస్ రానుంది. ఇక అల్లు అరవింద్ ఏకంగా ఆహా అనే ఓ డిజిటల్ ప్లాట్ ఫామ్ నే తయారు చేసి వరసపెట్టి వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నాడు.

ఇప్పుడు ఇదే దారిలో ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు అడుగులు వేస్తున్నాడు. గరుడ వేగ, గుంటూరు టాకీస్, చందమామ కథలు వంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు గత మూడు సంవత్సరాలుగా ఖాళీగా ఉంటున్నాడు. తాజాగా అక్కినేని నాగార్జునతో ఒక యాక్షన్ థ్రిల్లర్ ని మొదలుపెట్టాడు. ఇంతలు లాక్ డౌన్ రావడంతో సినిమా షూటింగ్ మధ్యలో నిలిచిపోయింది. దీంతో ఆయన వెబ్ కంటెంట్ పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రవీణ్ సత్తార్ ఓ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించనున్నారు. దీనికి ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్  వర్క్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ నిర్మించనుంది. బహుశా నాగ్ సినిమా సెట్ మీదకు వెళ్లడానికి ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. బహుశా ఆ గ్యాప్ లో ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సిరీసును తెరకెక్కించే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad