క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కేఏ వల్లభ నిర్మిస్తున్న సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. ఈ సినిమా లో దేవరకొండ సరసన రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లా కథానాయికలుగా నటిస్తున్నారు. రోమాంటిక్ ఎంటర్టైన్మెంట్ గా రాబోతున్న సినిమాను గత సంవత్సరం దసరా సమయం లో ప్రారంభమైనది. ఈ సినిమా షూటింగ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కానీ ఈ సినిమా కు పేరు మాత్రము ఇంకా ఖరారు కాలేదు. ఈ సినిమాలో విజయ దేవరకొండ సింగరేణి కార్మికునిగా కనిపించనున్నారు . అని వార్తలు వచ్చాయి. కానీ సింగరేణి కార్మికుడిగా చేయపోయి పాత్ర కేవలం ఒక భాగం మాత్రమేనట. దీనికన్నా మరొక సంచలనమైన వార్త మరొకటి సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తుంది.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సింగరేణి కార్మికుడిగాను, తండ్రి గాను నటిస్తున్నాడట. అయితే వృదుడిగా కాదు కేవలం ఎనిమిదేళ్ల బాబుకి నాన్న గా నటిస్తున్నాడు. సింగరేణి కార్మికులకులందరికి యూనియరన్ లీడర్‌గా వ్యవహరించనున్నట్లు టాక్. ఇప్పటివరకు రొమాంటిక్ హీరోగా ప్రేక్షకులను ఎంతో అలరించిన విజయ్, ఎనిమిదేళ్ల కుర్రాడికి తండ్రిగా ఎలా నటిస్తాడో అని ఎంతో ఆసక్తి కరముగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సినిమాటోగ్రఫీని జేకే చేస్తున్నారు.