Home సినిమా ప్రేక్షకులను ఊరించిన మిఠాయి..!

ప్రేక్షకులను ఊరించిన మిఠాయి..!

రెడ్ యాంట్స్ బ్యానర్ పై ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో యువ నటులు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకులుగా డాక్టర్ ప్రభాత్ కుమార్ రూపొందించిన సినిమా మిఠాయి. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కాంబినేషన్‌లో కామెడీ చిత్రంగా ఈ జనరేషన్ కి తగ్గట్టుగా ఈరోజు తెరకెక్కింది. ఈ సినిమా లో కామెడీ ఎలా పండించారో, ప్రేక్షకులను ఎలా మెప్పించిందో చూడాలంటే

కథలోకి వెళ్లాల్సిందే..

ఫస్టాఫ్ లో జానీ పాత్రలో ప్రియదర్శి, సాయి పాత్రలో రాహుల్ రామకృష్ణ నటించారు. వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా నటించారు. కాలిగా తిరుగుతూ రోజు బార్‌కి వెళ్లి మందు త్రాగుతూనే ఉంటారు. కానీ రాహుల్ రామకృష్ణను ఎప్పటికప్పుడు దురదృష్టం వెనకపడుతుంటుంది. ఈ సినిమాలో రాహుల్‌కు ఒక డొక్కు వెహికల్, నస పెట్టడానికి లవర్, అప్పుడప్పుడు తన కష్టాలను చెప్పుకునేందుకు ప్రియదర్శి తప్ప ఇంకెవరు లేరు. చివరకు బాస్ టార్చెర్ కు తట్టుకోలేక పెళ్లి జరిగే మూడురోజుల ముందే జాబ్ మానేస్తాడు. పెళ్లికి చేసుకునే ముందే జాబ్ పోగుట్టుకున్న బాధలో తాగి ఇంట్లో స్పృహ లేకుండా పడిపోతాడు. తెల్లవారుజామున మెలుకువ రాగానే ఇంట్లో చూసే సరికి దొంగ తనం అయినట్లు గుర్తిస్తాడు. పెళ్లి చేసుకునే ఆమె కోసం చేపించిన హారము, ఇంట్లో సామాను టి.వి, ల్యాప్ టాప్‌ దొంగతనానికి గురవుతాయి. క్రమేనా తన ఫ్రెండ్ (రవివర్మ)తో పార్టీ చేసుకోగా వారి మధ్య జరిగే గొడవ కాస్త ఒక ఛాలెంజ్‌కు దారి తీస్తుంది. దొంగను అతను పట్టుకున్నాకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ నేపథ్యం తోనే వెరీ నార్మల్‌గా కథ సాగుతుంది.

సెకండాఫ్‌ లో రాహుల్ అతని ఇంట్లో దొంగిలించబడిన వస్తువులను పట్టుకోవడం, ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలనే తపనతో కథ రన్ మొదలవుతుంది. ఎంతో కామెడీ సన్నివేశాలతో, మొత్తానికైతే కథ కొంతవరకు లాగాడు. ఈ సినిమాలో కొంత వరకు ట్విస్టులతో సాగిందని చెప్పవచ్చు.

ఈ కథలో ట్విస్టులు గూర్చి చూసుకుంటే దొంగను పట్టుకునే పరంగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దొంగను పట్టుకునే క్రమేనా వారి జర్నీలో, ఎదురైన వ్యక్తులతో జరిగే సంఘటనలు, చివరకు రామకృష్ణకు ప్రియురాలు పెద్ద షాక్ ఇస్తుంది? ఆ షాక్ ఏంటి? రాహుల్ దొంగను పట్టుకుంటాడా? ప్రియురాలుని పెళ్లి చేసుకుంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానం మిఠాయి చూడాల్సిందే.

బ్యానర్: రెడ్ యాంట్స్
దర్శకత్వం: ప్రశాంత్ కుమార్
నిర్మాత: డాక్టర్ ప్రభాత్ కుమార్
డైలాగ్స్: ప్రశాంత్ కుమార్, బి. నరేష్
నటీనటులు: ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, కమల్ కామరాజు, గాయత్రి గుప్తా, అజయ్ ఘోష్ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
ఎడిటర్: గ్యారీ బి.హెచ్
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ

Rating:2.5/5

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad