ప్రభుదేవా, తమన్నా జంట గా నటించిన సినిమా ‘దేవి’. తమిళంలో 2016లో విడుదలైన హర్రర్ సినిమాకు ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించి తెలుగులో అభినేత్రి టైటిల్ తో విడుదల చేశారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి సీక్వెల్ని సిద్ధం చేసి విడుదల తేదీ ని కూడా ఖరారు చేశారు.
తమిళము లో ‘దేవి 2’ టైటిల్ తో సిద్దమైన చిత్రాన్ని ఏప్రిల్ 12న తేదీన రిలీజ్ చేయుటకు సన్నాహాలు చేసుకున్నారు. ఆ రోజునేటాలీవుడ్ లో ‘అభినేత్రి 2’ పేరు తో విడుదలను ఖరారు చేశారు. కానీ తెలుగు , కన్నడ డిస్ప్లే రైట్స్ కు సంబంధించిన ట్రాన్సక్షన్స్ ఇంకా జరగక పోవటం వలన విడుదల తేదీని వాయిదా వేసుకున్నారట. ఏప్రిల్ 12వ తేదీన సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’, ప్రభుదేవా ‘అభినేత్రి 2’ విడుదల కానుంది. ప్రస్తుతానికి ‘చిత్రలహరి’ సోలో గా వెండి తెరకెక్కపోతుందని మెగా చిత్ర యూనిట్ భావిస్తోందట.