Home సినిమా టాలీవుడ్ న్యూస్ తెలుగు సింగర్లకు కరోనా పాజిటివ్

తెలుగు సింగర్లకు కరోనా పాజిటివ్

Telugu Singers Sunitha Malavika Tested Corona Positive

టాలీవుడ్‌లో కరోనా కలకలం రోజురోజుకూ విజృంభిస్తూ వస్తోంది. ఇప్పటికే కమెడియన్ పృథ్వీరాజ్ మొదలుకొని తాజాగా లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వరకు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. వారు త్వరగా కోలుకోవాలని వారి అభిమానులు కోరుతున్నారు. అయితే ఈ కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తుండటంతో తాజాగా ఇద్దరు టాలీవుడ్ సింగర్లకు ఈ వైరస్ సోకినట్లు తెలుస్తోంది.

తెలుగు సింగర్లు సునీత, మాళవికలకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఇటీవల వారిద్దరు ఓ టీవీ ఛానల్‌లో ప్రసారమయ్యే ఓ పాటల షోకు వారిద్దరు హాజరయ్యారు. అక్కడ వారిద్దరికీ కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో వారు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇద్దరు టాప్ సింగర్లకు కరోనా సోకడంతో సదరు షో నిర్వాహకులు ఆందోళనకు గురవుతున్నారు. ఆ షోలో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారో వారందరూ హోం ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది.

Telugu Singers Sunitha Malavika Tested Corona

ఏదేమైనా కరోనా సమయంలో బయటకు వెళ్లొద్దని పలువురు ఎంత చెబుతున్నా వృత్తిరీత్యా వెళ్తున్న వారు ఇలా కరోనా బారిన పడుతుండటంతో టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. మరి ఈ కరోనా వైరస్ ప్రభావం ఎప్పుడు తగ్గుతుందా అని ప్రజలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా ఇలా సినీ ఇండస్ట్రీలో కరోనా విజృంభిస్తుండటంతో పలువురు స్టార్స్ అసలు సినిమా షూటింగ్‌లు అంటేనే వణికిపోతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad