Home సినిమా తెలుగు నిర్మాతల నయా ట్రెండ్.. అవి కూడా ఓటీటీలోనే!

తెలుగు నిర్మాతల నయా ట్రెండ్.. అవి కూడా ఓటీటీలోనే!

PicsArt 08 06 11.04.32 1

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో సినిమా థియేటర్లు పూర్తిగా మూతపడ్డాయి. దీంతో ప్రేక్షకులు ఓటీటీ, ఏటీటీలకు ప్రాధాన్యత ఇస్తూ సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడిదే నిర్మాతల పాలిట లాభాలను తెచ్చిపెట్టే మార్గంగా మారింది. వరుసగా సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తూ మంచి లాభాలను గడిస్తున్న నిర్మాతలు, ఇప్పుడు మరో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. కేవలం తెలుగు సినిమాలనే కాకుండా ఇతర భాషల చిత్రాలను కూడా ఓటీటీలో రిలీజ్ చేసి క్యాష్ చేసుకుంటున్నారు.

ఇతర భాషలో తెరకెక్కి సక్సెస్ అయిన చిత్రాలను తెలుగులో డబ్ చేసి ఓటీటీలకు భారీ రేటుకు అమ్ముకుంటున్నారు. ఈ జాబితాలో ముఖ్యంగా చెప్పుకునే చిత్రాల్లో అందాల భామ కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ చిత్రం ఒకటి. ఈ సినిమాకు తమిళంలో ఎంత క్రేజ్ ఏర్పడిందో అందరికీ తెలిసిందే. ఆ క్రేజ్‌ను తెలుగులోనూ క్యాష్ చేసుకునేందుకు ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఇప్పుడు ఇదే పద్ధతిలో పలు సినిమాలను రిలీజ్ చేసేందుకు తెలుగు నిర్మాతలు రెడీ అవుతున్నారు.

ఇటు తెలుగులో పాన్ ఇండియా చిత్రాలను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటంతో, వాటికి ఇతర భాషల్లో కూడా క్రేజ్ తీసుకొచ్చేందుకు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇలా ఓటీటీల పుణ్యమా అని తెలుగు నిర్మాతలు స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతోనే కాకుండా డబ్బింగ్ చిత్రాలతోనూ అదిరిపోయే లాభాలను అందుకుంటున్నారు. ఇక ఈ కొత్త ట్రెండ్‌ను ఇతర భాషల నిర్మాతలు కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ కొత్త ట్రెండ్ ఎంతకాలం వర్కవుట్ అవుతుందో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad