Home సినిమా టాలీవుడ్ న్యూస్ పెళ్లి అచ్చిరాని తెలుగు హీరోలు.. క్యూ కట్టిన మరో ముగ్గురు!

పెళ్లి అచ్చిరాని తెలుగు హీరోలు.. క్యూ కట్టిన మరో ముగ్గురు!

Telugu Heroes Career Down After Marriage

టాలీవుడ్‌లో యంగ్ హీరోలుగా తమకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న వారు చాలా మందే ఉన్నారు. వారిలో చాలా మంది ప్రేక్షకులను మెప్పించి తమకంటూ ప్రత్యేక్ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని తమ కొత్తజీవితాన్ని మరింత విజయవంతం చేసుకోవాలని భావించారు. కానీ ఇటీవల టాలీవుడ్‌లో యంగ్ హీరోలు వరుసగా పెళ్లిల్లు చేసుకోవడంతో వారు తమ కెరీర్‌ను ముందుకు కొనసాగించడంలో చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు.

వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేర్లలో అల్లరి నరేష్, మంచు మనోజ్‌ల గురించి. ఈ హీరోలిద్దరు పెళ్లి చేసుకున్న తరువాత వారి సినిమా గ్రాఫ్ అమాంతం పడిపోయింది. కేవలం వీరు మాత్రమే కాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి వారికి కూడా పెళ్లి అయిన వెంటనే డిజాస్టర్‌లు మిగిలాయి. దీంతో యంగ్ హీరోలు పెళ్లి చేసుకున్న వెంటనే డిజాస్టర్స్‌ను మూటగట్టుకోవడం టాలీవుడ్‌లో ఆనవాయితీగా మారిపోయింది.

దీంతో ఇప్పుడు టాలీవుడ్‌లో పెళ్లి చేసుకుంటున్న యంగ్ హీరోలు ఆలోచనలో పడ్డారు. తమకు కూడా పెళ్లి తరువాత ఎలాంటి ఫలితాలు వస్తాయా అని వారు ఆందోళన చెందుతున్నారట. తాజాగా టాలీవుడ్‌లో నిఖిల్, నితిన్, రానా దగ్గుబాటిలు కూడా వివాహం చేసుకున్నారు. దీంతో వారి నెక్ట్స్ చిత్రాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయా అని వారి అభిమానుల్లో ఆందోళన నెలకొంది. మరి ఈ ముగ్గురు హీరోలు డిజాస్టర్ సెంటిమెంట్‌ను అధిగమిస్తారా లేక కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad