
టాలీవుడ్లో ఎలాంటి బ్యాక్‌డ్రాప్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి తేజస్వినీ మడివాడ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేందుకు ప్రయత్ని్స్తోంది. వరుసగా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ వెళ్తు్న్న ఈ బ్యూటీ, ఇటీవల సినిమాల్లో మంచి పేరును తెచ్చుకుంటోంది. ఇప్పటికే పలలు సినిమాల్లో నటిస్తూ వస్తోన్న ఈ బ్యూటీ బిగ్‌బాస్ రియాలిటీ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.
తన కెరీర్‌కు బూస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ షో తరువాత కూడా అమ్మడికి చెప్పుకోదగ్గ పాత్రలు రాలేదు. దీంతో ఎక్స్‌పోజింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే పనిలో ఈ బ్యూటీ పడింది. ఇప్పటికే కమిట్మెంట్ అనే సినిమాలో బోల్డ్ పాత్రలో నటిస్తున్న ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతుంది. గతకొంత కాలంగా అదిరిపోయే రేంజ్లో తన అందాల ఆరబోతతో తెలుగు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా బీచ్‌లో బికినీ వేర్‌తో రెచ్చిపోయింది ఈ పాప. తన అందాలను చూసినోళ్లకు చూసినంత అనే రేంజ్లో ప్రదర్శిస్తూ, తాను మాత్రం సముద్రపు నీటిని ఎంజాయ్ చేస్తోంది.
ఇలా హాట్ ఫోటోషూట్‌లో కుర్రకారును మరింత రెచ్చగొడుతున్న ఈ బ్యూటీ, బోల్డ్ పాత్రల్లో చెలరేగిపోయి నటించేందుకు తాను సిద్ధం అంటూ దర్శకనిర్మాతలకు క్లూ ఇచ్చేసింది. మరి ఇప్పటి నుండి అయినా ఆమెకు సినిమాల్లో ప్రాముఖ్యత ఉన్న పాత్రలు లభిస్తాయా, లేక అందాల ఆరబోత కోసమే ఆమెను తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంది.