Home సినిమా టాలీవుడ్ న్యూస్ తమన్నాకు తిక్కరేపిన డైరెక్టర్.. ఎందుకో తెలుసా?

తమన్నాకు తిక్కరేపిన డైరెక్టర్.. ఎందుకో తెలుసా?

Tamannaah Upset With Queen Director

టాలీవుడ్ బ్యూటీ తమన్నా గతకొంత కాలంగా చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది. దశాబ్ద కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న ఈ బ్యూటీ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్ కేటగిరీలోకి చేరడంతో ఆమె సినిమాలను చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తూ వస్తోంది. కాగా ఈ బ్యూటీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘క్వీన్’ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ఆమె ఆసక్తి కనబరిచిన సంగతి తెలిసిందే.

తెలుగులో క్వీన్ రీమేక్ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నట్లు గతంలోనే తెలిపాడు. కాగా ఈ సినిమాను ‘దటీజ్ మహాలక్ష్మీ’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను కూడా మొదలుపెట్టిన చిత్ర యూనిట్, కరోనా వైరస్ ప్రభావంతో సినిమా షూటింగ్‌ను వాయిదా వేశారు. అయితే ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్‌లు తిరిగి ప్రారంభం అవుతుండటంతో ఈ సినిమా షూటింగ్ కూడా మొదలవుతుందని అందరూ అనుకున్నారు.

కానీ దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘జోంబీ రెడ్డి’ని తెరకెక్కించేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఈ క్రమంలో దటీజ్ మహాలక్ష్మీ చిత్రాన్ని పక్కనబెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ వార్తలతో మిల్కీ బ్యూటీ తమన్నా చాలా అప్‌సెట్ అయినట్లు తెలుస్తోంది. క్వీన్ రీమేక్ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ కొట్టాలని చూసిన తమన్నా ఆశలు ఆవిరయ్యాయని పలువురు అంటున్నారు. మరి క్వీన్ రీమేక్ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తాడో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad