Home సినిమా 'సైరా'ను వీడని అడ్డంకులు ..!

‘సైరా’ను వీడని అడ్డంకులు ..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా ‘సైరా’ తెరకెక్కుతున్న విషయము అందరికి తెలిసిందే. ఈ సినిమా రామ్ చరణ్ నిర్మాణ పనులు చేపట్టగా, చిరంజీవి నటిస్తుండటంతో టాలీవుడ్‌లో, అభిమానుల్లో భారీ స్థాయి అంచనాలున్నాయి. మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను చూపించుటకు దర్శకుడు సురేందర్‌రెడ్డి కథకు తగినట్లుగా, చిరంజీవి పేరుకు తగ్గట్టుగా ప్రతి సన్నివేశాన్ని జాగ్రత్తగా తీర్చిదిద్దుతున్నాడు. ఈ చిత్రం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ముమ్మరంగా షూటింగ్ పనులు జరుగుతుంటే, సడెన్ గా ‘సైరా’కు అవాంతరం ఏర్పడింది. ఈ చిత్రంలో గల కొన్ని సీన్స్ ను తీయుటకు అంతా ఏర్పాటు పూర్తయ్యాక అవాంతరాన్ని ఎదుర్కొన్నారు సైరా టీమ్.

షూటింగ్ కోసం కర్ణాటకలో బీదర్‌ వద్ద గల బహమని కోట ను కేంద్రంగా చేసుకున్నారు చిత్ర యూనిట్. స్థానిక అధికారుచే అనుమతి లభించడంతో సన్నివేశాలకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. సోమవారం షూటింగ్ మరి కొద్దీ క్షణాల్లో ప్రారంభించే సమయానికి స్థానికులంతా  అడ్డుగా నిలిచారు. వివరాలేంటని తెలుసుకోగా ముస్లింల కోటలో హిందూ దేవుళ్ళ విగ్రహాలను నెలకొల్పి షూటింగ్ చేయటమే అసలు కారణం. షూటింగ్ లో భాగంగా మాత్రమే దేవతల విగ్రహాలను పెట్టాము అని చిత్ర యూనిట్ ఎంతగా వివరించినా, స్థానిక ముస్లింలు అంగీకరించలేదు. హిందూ విగ్రహాలను పెట్టి షూటింగ్ చేయకూడదని గట్టిగా వాదించారు స్థానిక ముస్లిములు.

ఈ విషయంపై చిత్ర యూనిట్ వారు ఎంతగా వారించినా అక్కడివారు ఒప్పుకోకపోవడంతో, అధికారులు కూడా ముస్లిం నేతలతో చర్చలు కొనసాగించారు. అప్పటికి కూడా ముస్లిం వారు షూటింగ్ జరుపుటకు ససేమిరా అన్నారు. ఇక అంతే ‘సైరా’ యూనిట్‌ సర్దుకొని వెనక్కి వెళ్ళిరావాల్సి వచ్చింది. ఎంతో ప్లాన్ ప్రకారం ఏర్పాట్లు జరిగాక, షూటింగ్ నిలిచి పోవడంతో  నిరాశగా వెనక్కి వచ్చారు చిత్ర యూనిట్. ఈ సన్నివేశాలకు తగ్గట్టుగా హైదరాబాద్‌లోనే భారీ సెట్స్ ఏర్పాటు చేయాలనీ దర్శకులు సురేందర్ ప్లాన్ చేయాలని ఆలోచనతో ఉన్నట్లు మరో సమాచారం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad