Home సినిమా సుశాంత్ గ‌ర్ల్ ఫ్రెండ్ రియా కాల్ డేటా బ‌ట్ట‌బ‌య‌లు...ఆత్మ‌హ‌త్య‌కు ఆమే కార‌ణమా...

సుశాంత్ గ‌ర్ల్ ఫ్రెండ్ రియా కాల్ డేటా బ‌ట్ట‌బ‌య‌లు…ఆత్మ‌హ‌త్య‌కు ఆమే కార‌ణమా…

sush thumb

బాలీవుడ్ యువ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే ఉంది. స్టార్ హీరోగా ఉన్న అత‌ను సూసైడ్ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఎందుకొచ్చింది అనేది ఎవ‌రికీ అంతుప‌ట్ట‌డం లేదు. దీనిపై ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల వాద‌న‌లు, ఆరోప‌ణ‌లు తెర‌పైకి వ‌చ్చాయి. సుశాంత్‌కి సినిమాలు లేకుండా చేసి బాలీవుడ్ మూవీ మాఫియానే ఆత్మ‌హ‌త్య చేసుకునేలా చేసింద‌ని కొంద‌రు….లేదు అత‌ని గ‌ర్ల్ ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తి వ‌ల్ల చ‌నిపోయాడ‌ని మ‌రికొంద‌రు…ఇలాంటివెన్నో తెర‌పైకి వ‌చ్చాయి. ముంబైతోపాటు పట్నా పోలీసులు ఇద్ద‌రూ విచారించారు.

ఈ క్ర‌మంలో అస‌లు కేసు ఎటు వెళ్తుంది కూడా తెలియ‌ని ప‌రిస్థితులు వ‌చ్చి ప‌డ్డాయి. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. సుశాంత్ మ‌ర‌ణంపై త‌ల్లిదండ్రులతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు అనుమానాలు వ్య‌క్తం చేశారు. అంతేకాదు…సుశాంత్ గ‌ర్ల్ ఫ్రెండ్ రియాపై ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఈ కేసును సీబీఐకి అప్ప‌గిస్తున్న‌ట్టు సుప్రీంకోర్టుకు స్ప‌ష్టం చేసింది.దీంతో రంగంలోకి దిగిన సీబీఐ….నిజాల అన్వేష‌ణ‌లో ప‌డింది. సుశాంత్ ఆత్మ‌హ‌త్య వెనుక దాగి ఉన్న కార‌ణాల‌ను వెలికితీసే ప‌నిలో బిజీ అయిపోయింది. ఈ క్ర‌మంలో సుశాంత్ గ‌ర్ల్ ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తి కాల్ డేటా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఐదు రోజుల్లోనే సుశాంత్‌కు 25 సార్లు కాల్ చేసిన‌ట్టుగా తెలిసింది. త‌న వ‌ద్ద‌కు వెంట‌నే రావాల‌ని….లేదంటే ఊరుకోన‌ని బెదిరించిన‌ట్టుగా స‌మాచారం. అయితే అన్ని సార్లు ఎందుకు చేయాల్సి వ‌చ్చింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అలా అన్ని సార్లు ఫోన్ చేసిన విష‌యాన్ని…సుశాంత్ త‌న త‌ల్లిదండ్రుల‌తో కూడా పంచుకున్నాడు. రియా త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి …త‌న‌ను పిచ్చి ఆస్ప‌త్రిలో చేర్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని పేరెంట్స్ ఎదుట వాపోయిన‌ట్టు స‌మాచారం. త‌న‌కు అలా వెళ్లాల‌ని లేద‌ని హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో ఒక మారుమూల గ్రామంలో ఉండాల‌ని ఉంద‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. విశ్వాస‌నీయ స‌మాచారం ప్ర‌కారం…రియా త‌న మాట‌ల‌తో ప‌దేప‌దే సుశాంత్‌ను హింసించేద‌ని వాద‌న‌లు కూడా ఉన్నాయి.

అవి త‌ట్టుకోలేకే చ‌నిపోయాడా అనే అనుమానాలు ఇప్పుడు బ‌ల‌పడుతున్నాయి. రియా ఫోన్ అన్ని సార్లు ఫోన్ చేసే స‌మయానికి…..సుశాంత్ త‌న సోద‌రితో క‌లిసి ఉన్న‌ట్టు స‌మాచారం. జూన్ 14వ తేదీన ముంబైలోని త‌న ఫ్లాట్ లోనూ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమాన‌స్ప‌ద స్థితిలో చ‌నిపోయాడు. అది ఆత్మ‌హ‌త్యేన‌ని పోస్టుమార్టం నివేదిక తేల్చి చెప్పింది. బాలీవుడ్ లో నెపోటిజం వ‌ల్లే సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌నే వాద‌న‌లు బ‌లంగా వినపడ్డాయి. ఇదే స‌మ‌యంలో సుశాంత్ కుటుంస‌భ్యులు కూడా ఆరోప‌ణ‌లు చేయ‌డంతో…కేసు ఎన్నో మ‌లుపులు తిరిగింది. ఈ నేప‌థ్యంలో కేసును సీబీఐకి అప్ప‌గించ‌డంతో…..మ‌రో కీల‌క మ‌లుపు తిరిగింది. విచార‌ణ‌లో భాగంగా ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తిపై కొన్ని అభియోగాలు కూడా మోపింది. పూర్తి స్థాయి విచార‌ణ త‌ర్వాత …..ఆమెను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad