
తమిళ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆకాశమే నీ హద్దురా ఇప్పటికే మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సూర్య రెడీ అవుతున్నాడు. గతకొంత కాలంగా సరైన హిట్లు లేక సూర్య చతికలబడ్డాడు. అయితే ఈ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకోవాలని సూర్య చూస్తు్న్నాడు. లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఈ సినిమాను డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను తొలుత వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ కరోనా ప్రభావంతో సినిమా థియేటర్లు మూతపడటంతో ఈ సినిమాను రిలీజ్ చేయడం కుదరలేదు. ఇక ఈ సినిమాను థియేటర్లు తెరుచుకున్న వెంటనే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఈ మేరకు సూర్య తాజాగా ఓ ప్రకటన కూడా రిలీజ్ చేశాడు. తాను నటిస్తున్న ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామని, అక్టోబర్ 30న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో చూడవచ్చని సూర్య తెలిపాడు. స్టార్ హీరో సినిమా అయినా కూడా ఓటీటీలో రిలీజ్ అవుతుండటంతో తమిళంలో రిలీజ్‌కు రెడీగా ఉన్న పలు చిత్రాలను కూడా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.