Home సినిమా టాలీవుడ్ న్యూస్ సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయిన సూర్య మూవీ

సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయిన సూర్య మూవీ

Suriya Aakaasam Nee Haddhu Ra Completes Censor Work

తమిళ స్టా్ర్ హీరో సూర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ హీరో నటించిన ప్రతి సినిమాను తెలుగులోనూ రిలిజ్ చేస్తుంటారు. కాగా ఇక్కడ కూడా ఆయన సినిమాకు మంచి ఫలితాలు దక్కుతుండటం విశేషం. అయితే సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశమే నీ హద్దురా’ ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను లేడీ డైరెక్టర్ సుధా కొంగర డైరక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

కాగా ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు ముగించుకుంది. తమిళంలో ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీని పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం ఖాయమని వారు అన్నారట. ఇక ఈ సినిమాలో సూర్య పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా ఈ సినిమాతో సూర్య మంచి విజయాన్ని అందుకుంటాడని సెన్సా్ర్ బోర్డు వారు తెలిపారట.

ఇక సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ప్రస్తుతం థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో ఈ సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫాంపై రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగు వర్షన్ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ సినిమాను ఓటీటీ ప్రేక్షకులు ఎంతమేర ఆదరిస్తారో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad