Home సినిమా టాలీవుడ్ న్యూస్ యూటర్న్ తీసుకున్న సునీల్:మళ్లీ హీరోగా!

యూటర్న్ తీసుకున్న సునీల్:మళ్లీ హీరోగా!

capture 1598858182

ప్రస్తుతం కమెడియన్ సునీల్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అనే విధంగా తయారయింది. మొదట్లో కమెడియన్ గా మెప్పించిన సునీల్ ఆ తర్వాత హీరోగా టర్న్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాడు.  అందాల రాముడు, ‘మర్యాద రామన్న, పూలరంగడు వంటి సినిమాలు మంచి విజయం సాధించడంతో  హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే ఆ  తర్వాత నుండి పరిస్థితులు మారుతూ వచ్చాయి. 2014 నుండి వరుస ఫ్లాపులతో సునీల్ డీలా పడ్డాడు. పూలరంగడు సమయంలో సిక్స్ ప్యాక్ చేసి అనారోగ్యం పాలయ్యారు. దీని వలన ముఖం మరియు శరీరంలో అనేక మార్పులు జరిగి అటు హీరోగా ఇటు కమెడియన్ గా నిలబడలేకపోయారు. ఆ తరువాత మళ్లీ తన పాత కామెడీకి తిరిగి వచ్చేశాడు.

తాజాగా సునీల్ యూ టర్న్ తీసుకున్నారడు. మరోసారి హీరోగా మారి తన సత్తా చాటాలని తహతహలాడుతున్నారు. తాజాగా సునీల్ వేదాంతం రాఘవయ్య అనే సినిమాకు ఓకే చెప్పారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కథను అందిస్తుండగా, 14 రీల్స్ నిర్మాణ సంస్థ సినిమాను రూపొందిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఆగస్టు 31న  విడుదలైంది. అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది మాత్రం మూవీ టీం ప్రకటించలేదు.

సునీల్ ‘కలర్ ఫొటో’ సినిమా ద్వారా విలన్ గా మరోసారి తన లక్ ను ప్రయత్నించుకుంటున్నారు. మొదట ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేద్దాం అనుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మూవీ టీం సినిమాను తెలుగు ఓటీటీ ఆహాలో విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ సినిమా ద్వారా అయినా సునీల్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి మరి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad