Home సినిమా కమెడియన్ నుండి హీరోగా మారి విలన్‌గా సెటిల్ అవుతున్న సునీల్

కమెడియన్ నుండి హీరోగా మారి విలన్‌గా సెటిల్ అవుతున్న సునీల్

PicsArt 08 06 06.48.12 1

టాలీవుడ్‌లో కమెడియన్ నుండి హీరోగా మారిన వారు చాలా మంది కెరీర్‌లో సక్సెస్ అయ్యారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆలీ, బాబు మోహన్‌ల గురించి. వారు హీరోలుగా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌లుగా నిలిచాయి. ఇక ఈ జాబితాలో సునీల్ తనకంటూ ప్రత్యే ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఈ నటుడు, హీరోగా మారి సూపర్ సక్సెస్‌ను అందుకున్నాడు.

కాగా హీరోగా వరుసగా సినిమాలు చేసినా అవన్నీ ఫ్లాప్‌లుగా నిలవడంతో సునీల్ కెరీర్ డైలమాలో పడింది. దీంతో అతడు తిరిగి కామెడీ పాత్రలు చేయాలని ప్రయత్నించాడు. కానీ అతడికి అదృష్టం మాత్రం కలిసి రాలేదు. హీరో నుండి కమెడియన్‌గా ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యాడు సునీల్. దీంతో ఇప్పుడు విలన్ పాత్రల్లో నటించేందుకు మొగ్గు చూపుతున్నాడు ఈ భీమవరం బుల్లోడు. మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా చిత్రంలో విలన్‌గా నటించి అందరికీ షాకిచ్చిన సునీల్, ఇప్పుడు మరోసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.

సుహాస్, చాందినీ చౌదిరి హీరోహీరోయిన్లుగా తరకెక్కుతున్న కలర్ ఫోటో చిత్రంలో లంచగొండి పోలీస్ ఆఫీసర్ పాత్రలో సునీల్ నటిస్తున్నాడు. ఈ పాత్రలో నెగెటివ్ షేడ్స్‌ను సునీల్ బాగా పండించాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ కాగా, అందులో సునీల్ పాత్ర ఎలా ఉంటుందో మనకు చిత్ర యూనిట్ చూపించింది. మరి కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్, ఇప్పుడు విలన్ పాత్రలోనైనా సెటిల్ అవుతాడా లేడా అనేది చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad