
టాలీవుడ్లో ఇటీవల వరుసగా హీరోలు పెళ్లి్ల్లు చేసుకుంటున్నారు. యంగ్ హీరో నిఖిల్ మొదలుకొని, నితిన్, రానా దగ్గుబాటి ఇలా వరుసగా హీరోలందరూ పెళ్లి చేసుకుంటూ వచ్చారు. అయితే తాజాగా మరో యంగ్ హీరో కూడా పెళ్లికి రెడ అవుతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లోని బ్యాచ్లర్లలో సందీప్ కిషన్ కూడా ఒకరు. కాగా తాజాగా ఆయన కూడా బ్యాచ్‌లర్ లైఫ్‌కు టాటా చెప్పేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్లో తనకంటూ మంచి గుర్తంపును తెచ్చుకున్న ఈ హీరో, వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. గెలుపు ఓటమిలకు అతీతంగా సినిమాలు చేస్తూ వస్తోన్న ఈ హీరో త్వరలోనే తన జీవితంలో ఓ కొత్త అంశాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపాడు. కాగా ఈ కొత్త జీవితానాకి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను ఆగస్టు 16న చేయబోతున్నట్లు, ఈ కొత్తజీవితంపై ఆయన చాలా ఆశగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.
2020 సంవత్సరం చాలా విషయాలను నేర్పిందని, కొన్ని కష్టాలతో పాటు వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా ఇచ్చిందని, మరికొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం కూడా ఈ ఏడాది కలిగించిందని సందీప్ చెప్పుకొచ్చాడు. మరి సందీప్ కిషన్ పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక సందీప్ కిషన్ చెప్పబోయే శుభవార్త పెళ్లి గురించేనా లేక ఇంకేమైనా ఉందా అనే అనుమానం మరికొందరిలో నెలకొంది.