Home సినిమా టాలీవుడ్ న్యూస్ పుష్ప కోసం సుకుమార్ బాగానే లాగుతున్నాడుగా!

పుష్ప కోసం సుకుమార్ బాగానే లాగుతున్నాడుగా!

Sukumar Remuneration For Pushpa Movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా సుకుమార్ తీర్చిదిద్దుతున్నాడు. కాగా ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తుండటంతో ఈ సినిమా ఎలాం ఉంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా కోసం సుకుమార్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న సుకుమార్ ఏకంగా రూ.20 కోట్ల మేర రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడట. గతంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ‘రంగస్థలం’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన సుకుమార్‌కు నెక్ట్స్ చిత్రానికి రెమ్యునరేషన్ పెంచుతామని నిర్మాతలు మాట ఇచ్చారట.

ఇప్పుడు ఆ మాట మేరకే సుకుమార్‌కు ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బన్నీ చాలా రఫ్, మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో ఆయన ఓ లారీడ్రైవర్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడగా, వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని చిత్ర యూనిట్ చూస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad