Home సినిమా చిట్టిబాబుకే ఓటేసిన సుకుమార్.. రీసౌండ్ గ్యారెంటీ?

చిట్టిబాబుకే ఓటేసిన సుకుమార్.. రీసౌండ్ గ్యారెంటీ?

Sukumar Next Movie With Ram Charan

టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్‌గా సుకుమార్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుని వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే రంగస్థలం చిత్రంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి అదిరిపోయే హిట్ అందుకున్న ఈ డైరెక్ట్ తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సుకుమార్ తీర్చిదిద్దుతున్నాడు.

ఇక ఈ సినిమా తరువాత సుకుమార్ తన నెక్ట్స్ మూవీని ఎవరితో తెరకెక్కిస్తాడా అనే అంశం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇప్పటికు యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లు తమ నెక్ట్స్ చిత్రాలతో బిజీగా మారనున్నారు. అటు ప్రభాస్ కేవలం పాన్ ఇండియా చిత్రాలకు మాత్రమే ఓటు వేస్తుండటంతో సుకుమార్ ఎవరితో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించాలా అనే అయోమయంలో పడ్డాడు. కాగా స్టార్ హీరోల్లో కేవలం రామ్ చరణ్ మాత్రమే ఇంకా తన నెక్ట్స్ మూవీని ఓకే చేయకుండా ఉన్నాడు.

దీంతో సుకుమార్ తన నెక్ట్స్ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి చేసేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో రంగస్థలం చిత్రానికి కలిసి నటించిన వీరిద్దిరు ఇప్పుడు మరోసారి కలిసి నటించేందుకు రెడీ అవుతుండటంతో ఈసారి చరణ్ కోసం సుకుమార్ ఎలాంటి కథను రెడీ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి పుష్ప వంటి చిత్రం తరువాత సుకుమార్ ఎలాంటి కథతో మనముందుకు వస్తాడా, రామ్ చరణ్‌కు చిట్టిబాబు లాంటి రీసౌండ్ బ్లాక్‌బస్టర్ అందిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad