Home సినిమా గాసిప్స్ ఓటీటీలోకి సుడిగాలి సుధీర్!: గాలి వీచేనా

ఓటీటీలోకి సుడిగాలి సుధీర్!: గాలి వీచేనా

Despite flops Sudigali Sudheer getting offers 1200x900 1

కరోనా లాక్ డౌన్  కారణంగా థియేటర్లు&మల్టీప్లెక్స్ లు మూతపడ్డాయి. ఎప్పుడు తెచ్చుకుంటాయన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. దీంతో ఇండస్ట్రీ మొత్తం ఓటీటీ వైపు అడుగులు వేస్తోంది. చిన్నపెద్ద తేడా లేకుండా అందరు హీరోలు ఓటీటీకి క్యూ కడుతున్నారు. పరిస్థితి ఎంతలా మారిందంటే…ఒకప్పుడు థియేటర్ కోసం సినిమాలు తీసే స్థాయి నుండి ఓటీటీ కోసమే ప్రత్యేకంగా ఓ సినిమాను తెరకెక్కించి స్థాయికి మారింది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఓటీటీలోకి  అడుగు పెడుతున్నారని తెలుస్తోంది.

2019లో ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ కమెడియన్ విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేక పోయాడు. ఆ తరువాత త్రీ మంకీస్ అని మరో చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయాడు. ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా డేబ్ల్యూ సినిమాలే అట్టర్ ఫ్లాప్ కావడంతో సుధీర్ పూర్తిగా బుల్లి తెరకు పరిమితం అయిపోయాడు. అయితే అతడికి ఓటీటీ మంచి అవకాశాన్ని ఇచ్చింది. తాజాగా సుధీర్ ఓ సినిమాకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాత అంజన్ బాబు నిమ్మల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నేరుగా ఓటీటీలోనే విడుదల కానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఓటీటీ కోసమే ఓ సినిమాను తెరకెక్కించడం ఇదే మొట్టమొదటిసారి. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న రాజశేఖర్ రెడ్డి గతంలో సుధీర్ తో కలిసి ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ అనే సినిమాను చేశారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది అని చిత్రబృందం ప్రకటించింది.     

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad