Home సినిమా స్టిల్ బ్యాటింగ్ చేస్తోన్న ముద్దుగుమ్మ‌లు..!

స్టిల్ బ్యాటింగ్ చేస్తోన్న ముద్దుగుమ్మ‌లు..!

సినీ ప‌రిశ్ర‌మ‌లో హీరోయిన్లు వ‌రుస‌గా ఐదేళ్ల‌పాటు త‌మ కెరీర్‌ను ర‌న్ చేయ‌డ‌మంటే ప్ర‌స్తుతం గ‌గ‌న‌మే అని చెప్పాలి. అలాంటి ప‌రిస్థితుల్లో హాఫ్ సెంచ‌రీని కంప్లీట్ చేసి సూప‌ర్ రికార్డును సెట్ చేసుకున్నారు కొంత మంది హీరోయిన్‌లు. ఆ హీరోయిన్‌ల లిస్ట్ మీకోసం..

న‌య‌న‌తార :
సౌత్ ఇండియ‌న్ లేడీ సూప‌ర్ స్టార్ అని అనిపించుకుంటున్న న‌య‌న‌తార చాన్నాళ్ల క్రిత‌మే 50కు పైగా చిత్రాల్లో నటించిన మార్క్‌ను దాటేసింది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ సినిమాల్లో న‌టిస్తూ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అద్ద‌ర‌గొట్టేస్తున్న ఈ బ్యూటీ, మూడేళ్ల క్రితం వ‌చ్చిన మాయ సినిమాతో అర్థ శ‌త‌కం కొట్టింది. ఈ హాఫ్ సెంచ‌రీ త‌రువాత మ‌రింత స్పీడ్‌తో కెరీర్‌ను ర‌న్ చేస్తోంది. ఏడాదికి ఐదారు సినిమాల‌ను రిలీజ్ చేస్తోంది. న‌య‌న్ ప్ర‌స్తుతం తెలుగులో సైరా సినిమాలో న‌టిస్తోంది.

కాజ‌ల్ :
సినిమా.. సినిమాకు మ‌రింత గ్లామ‌ర్‌గా తయార‌వుతూ కుర్రాళ్ల‌ను ప‌డేస్తున్న కాజ‌ల్ చాన్నాళ్ల క్రిత‌మే హాఫ్ సెంచ‌రీ కొట్టింది. తేజ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన నేనే రాజు.. నేనే మంత్రి సినిమానే కాజ‌ల్‌కు 50వ సినిమా. ఇక అర్ధ‌శ‌త‌కం పూర్త‌య్యాక కూడా కాజ‌ల్ క్రేజీ ఆఫ‌ర్స్‌ను అందుకుంటూనే ఉంది. ప్ర‌స్తుతం బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌తోపాటు, ప్యారీస్‌.. ప్యారీస్, ఇండియ‌న్‌-2లోనూ న‌టిస్తోంది ఈ చంద‌బామ‌.

త్రిష :
96, పేటా లాంటి సినిమాల‌తో త‌మిళనాట ఫుల్ స్వింగ్లో ఉన్న త్రిష కూడా హాఫ్ సెంచ‌రీ కంప్లీట్ చేసింది. క‌మ‌ల్‌హాస‌న్‌తో క‌లిసి న‌టించిన తూంగ‌వ‌నం సినిమానే ఈ చెన్నై బ్యూటీకి 50వ సినిమా. ఇక యాక్ట‌ర్‌గా 19 ఏళ్ల‌ను పూర్తి చేసుకుంటున్న త్రిష ప్ర‌స్తుతం ఐదు సినిమాల్లో న‌టిస్తోంది. హీరోయిన్‌గానే మ‌రో 20 ఏళ్ల‌పాటు సినిమాల‌ను చేయ‌గ‌ల‌న్న హింట్స్‌ను ఇస్తోంది త్రిష‌.

అనుష్క :
బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి సినిమాల‌తో సూప‌ర్ క్రేజ్‌ను సంపాదించుకున్న అనుష్క హాఫ్ సెంచ‌రీకి ఐదు సినిమాల దూరంలో ఉంది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సైలెన్స్ సినిమా ఈ స్వీటీకి 46వ సినిమా. ఆస్ట్రేలియా వెళ్లి వెయిట్ లాస్ అయి వ‌చ్చిన ఈ సైజ్ జీరో బ్యూటీ అతి త్వ‌ర‌లోనే హాఫ్ సెంచ‌రీ కొట్టేలా క‌నిపిస్తోంది.

స‌మంత :
అక్కినేని వారి కోడ‌లు స‌మంత కూడా హాఫ్ సెంచ‌రీకి చేర‌వ‌వుతోంది. పెళ్లి త‌రువాత కూడా సినిమాల‌ను కంటిన్యూ చేస్తున్న స‌మంత 40 సినిమాల‌ను క్రాస్ చేసింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ నాగ చైత‌న్య‌తో మ‌జిలీ చేస్తోంది. నందినీరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ బేబీ ఎంత స‌న్న‌గా ఉన్నావే అనే సినిమాలోనూ న‌టిస్తోంది. ఈ సినిమాల‌తో క‌లిపితే మ‌రో రెండేళ్ల‌లో స‌మంత హాఫ్ సెంచ‌రీని కంప్లీట్ చేయ‌డం క‌న్ఫాం.

హ‌న్సిక :
తెలుగు, తమిళ్‌లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హ‌న్సిక కూడా హాఫ్ సెంచ‌రీ కొట్టేసింది. జూనియ‌ర్ కుష్బూగా త‌మిళ‌నాట గుడి క‌ట్టించుకున్న మ‌హాని హార్ర‌ర్ థ్రిల్ల‌ర్‌తో 50 కి చేరువైంది. అలాగే ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో జ‌య‌ప్ర‌ద పాత్ర‌ను పోషిస్తోంది హన్సిక‌.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad