Home సినిమా గాసిప్స్ దూసుకుపోతున్న ముదురు భామలు

దూసుకుపోతున్న ముదురు భామలు

Star Heroines Line Up Movies

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణించిన వారు చాలా మందే ఉన్నారు. అయితే ప్రస్తుత కాలంలో వారిలో దశాబ్దాలుగా రాణిస్తున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. స్టార్ హీరోయిన్లుగా ముద్ర వేసుకున్న వీరిని వేళ్లపై లెక్కపెట్టవచ్చు. అయితే వారు తెలుగు, తమిళ చిత్రాల్లో వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్టులను ఓకే చేసిన ఈ బ్యూటీలు, తమ నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టే పనిలో పడ్డారు.

కాగా కొత్త హీరోయిన్లకు ఎక్కువ అవకాశాలు లేకుండా చేస్తున్న ఈ ముదురు భామలు ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకే ఓటు వేస్తున్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అందాల భామ నయనతార గురించి. స్టార్ హీరోలు మొదలుకొని, యంగ్ హీరోల వరకు తమిళంలో అందరూ కోరుకునేది నయన్‌నే. ఆమె డేట్స్ కావాలంటే రెండేళ్లు ఆగాలంటే, అక్కడ ఆమెకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్ధమవుతోంది. ఇక మరో బ్యూటీ కాజల్ అగర్వాల్‌ది కూడా ఇదే పరిస్థితి. తెలుగుతో పాటు తమిళంలోనూ వరుసగా సినిమాలు చేస్తున్న ఈ చందమామ,ఇప్పుడు మాలీవుడ్ జనాలను అలరించేందుకు రెడీ అవుతోంది.

అటు మిల్కీ బ్యూటీ తమన్నా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు హీరోయిన్, విలన్ తరహా పాత్రలను చేస్తూ ఉంది. కాగా కొంతకాలం గ్యాప్ తీసుకుని తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిన బ్యూటీ త్రిష కూడా ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ వెళ్తోంది. ఇక ఈ ముదురు భామల బ్యాచ్‌లో కేవలం అనుష్క, హన్సికలు మాత్రం చాలా తక్కువ అవకాశాలతో ఉన్నారు. ఏదేమైనా దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీలు ఇంకా జనాలకు ఏదో ఒక కొత్త అనుభూతిని పంచుతూ ఉండటం విశేషమనే చెప్పాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad