Home సినిమా గాసిప్స్ ఆ డైరెక్టర్‌కు దరిద్రం ఏ రేంజ్‌లో ఉందంటే!

ఆ డైరెక్టర్‌కు దరిద్రం ఏ రేంజ్‌లో ఉందంటే!

Sreenu Vaitla Bad Luck Continues

టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస చిత్రాలతో దూకుడు చూపించిన దర్శకుడు శ్రీను వైట్ల, ఆ తరువాత వరుస వైఫల్యాలతో ఆగమైపోయాడు. చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగలడంతో ఆయన పేరు చెబితేనే హీరోలు భయపడే స్థాయికి వెళ్లిపోయాడు. ఇక ఎలాగోలా తాను సక్సె్స్ అందించిన హీరోలతో సినిమాలు చేస్తున్నా, వాటిని కనీసం పట్టించుకున్న నాధుడే లేకుండా పోయారు. శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘అమర్ అక్బర్ ఆంథోని’ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగలడంతో ఇప్పుడు ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

కాగా గతంలో మంచు విష్ణుకు హీరోగా ‘ఢీ’ చిత్రంతో అదిరిపోయే సక్సెస్‌ను అందించాడు శ్రీను వైట్ల. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు వైట్ల రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాలో నటించేందుకు మంచు విష్ణు కూడా ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో విష్ణు అనుకున్న పనులన్నీ తారుమారు అయ్యాయి. దీంతో ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మోసగాళ్లు’పై మాత్రమే ప్రస్తుతం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఇప్పట్లో శ్రీను వైట్లతో చేయబోయే సినిమాను ప్రారంభించే ఆలోచన విష్ణుకు లేదని తెలుస్తోంది.

దీంతో శ్రీను వైట్ల దరిద్రం మామూలుగా లేదుగా అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోలు కూడా శ్రీను వైట్లతో సినిమాలు చేసేందుకు క్యూ కడితే, ఇప్పుడు కనీసం రేంజ్ హీరోలు కూడా ఆయనతో సినిమా చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. మరి శ్రీను వైట్ల తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad