Home సినిమా గాసిప్స్ అడ్డంగా బుక్కయిన శ్రీముఖి.. పాపం అంటోన్న ఫ్యాన్స్!

అడ్డంగా బుక్కయిన శ్రీముఖి.. పాపం అంటోన్న ఫ్యాన్స్!

Sreemukhi New Movie Postponed Due To Lockdown

టాలీవుడ్ బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. రోజూ ఏదో ఒక షోతో టీవీలో సందడి చేసే ఈ భామ, ఆ మధ్య బిగ్‌బాస్ షోలో పాల్గొని మంచి క్రేజ్‌ను సాధించింది. కాగా ఈ బ్యూటీ తాజాగా ఓ సినిమాలో లీడ్ రోల్‌లో నటించింది. అయితే ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో శ్రీముఖి ఆశలపై నీళ్లు జల్లినట్లు అయ్యింది.

‘ఇట్స్ టైమ్ టు పార్టీ’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి సైబర్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను గౌతమ్ EVS డైరెక్ట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్న శ్రీముఖి, సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ఆమె చాలా నిరాశకు లోనవుతోంది. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 11న ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాతో శ్రీముఖి ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది.

మొత్తానికి బుల్లితెర నుండి వెండితెరకు వెళ్తున్న యాంకర్లు అక్కడ కూడా రాణిస్తుండటంతో ఇప్పుడు శ్రీముఖి కూడా తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునేందుకు రెడీ అవుతుంది. గతంలోనే ఈ బ్యూటీ ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించగా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మరి ఈసారి శ్రీముఖి నటించిన లేటెస్ట్ మూవీ అదిరిపోయే హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad