Home సినిమా 'సమంత' ను కామెంట్ చేసిన 'జెర్సీ' హీరోయిన్ .. మండి పడుతున్నసామ్ అభిమానులు..!

‘సమంత’ ను కామెంట్ చేసిన ‘జెర్సీ’ హీరోయిన్ .. మండి పడుతున్నసామ్ అభిమానులు..!

అందాల ముద్దు గుమ్మ అక్కినేని సమంత వరుస సక్సెస్ తో ముందుకు దూసుకెళ్లిపోతుంది. ‘రంగ స్థలం’ లో తన అభినయంతో అందరిని ఆకర్శించి తన వైపు లాగేసుకుంది. పెళ్ళికి ముందు తన గ్లామర్ తో అందరిని మెప్పించిన అమ్మడు… పెళ్లి తరువాత డీసెంట్ గా కనిపించింది. ఇక నాగ చైతన్య, సమంత ఇద్దరు కలిసి జంట గా నటించిన సినిమా ‘మజిలీ’. ఈ సినిమాలో సమంత తానేంటో మరో సారి ప్రూవ్ చేసుకుంది. ఈ సినిమాలో సమంత నటన గురించి పొగడని వారెవ్వరూ లేరు. అలాంటి ట్రాక్ రికార్డును సొంతం చేసుకొని.. క్రేజ్ కొట్టేసిన అమ్మడి గురుంచి ‘జెర్సీ’ భామ శ్రద్ధా శ్రీనాథ్ సంచలన వ్యాఖ్యలను వదిలింది. ఈ విషయం పై సామ్ అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. గత సంవత్సరం శ్రద్ద శ్రీనాథ్ ‘యూటర్న్’ చిత్రాన్ని కన్నడలో నటించగా, తెలుగు, తమిళ రీమేక్ లో  సమంత నటించింది.  అయితే శ్రద్ద ఒక ప్రముఖ ఛానెల్ కు ఇంటర్వ్యూఇవ్వగా .. శ్రద్ద కు యాంకర్ నుంచి “మీరు నటించిన ‘యూ టర్న్’ సినిమాను సమంత ఎలా నటించింది.” అనే ప్రశ్న తలెత్తింది. అంతే ఇక సమాధానంగా “నేను ఆ సినిమా చూశాను.. అరగంట సేపు కూడా నేను ఆ సినిమాను చూడలేక పోయాను. నేను నటించిన పాత్రలో వేరే వాళ్ళని ఊహించలేక పోయాను” అంటూ చెప్పేసింది.

ఇక ఈ అమ్మడు మాట్లాడిన మాటలకూ సమంత ఫాన్స్ అందరూ.. ఏ మాత్రం ఎక్సపీరియన్స్ లేని శ్రద్ద సమంత గురించి కామెంట్ చేయడం సబబు కాదని తెలియ చేశారు. సీనియర్ నటి పై ఇలా మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ అంటూ సామ్ అభిమానులు శ్రద్ద పై మండి పడుతున్నారు. ప్రస్తుతం నాని సరసన ‘జెర్సీ’ సినిమాలో నటించింది. ఈ సినిమాను ఈ నెల 19వ తేదీన విడుదల జరగనుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad