Home టాప్ స్టోరీస్ బాలు ఆరోగ్యంపై ఆయన కొడుకు ఏమన్నాడంటే?

బాలు ఆరోగ్యంపై ఆయన కొడుకు ఏమన్నాడంటే?

SP Balasubrahmanyam Health Update

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గతకొద్ది రోజులుగా కరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు కరోనా సోకిన విషయాన్ని బాలు స్వయంగా తెలియజేశారు. అయితే ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూకి తరలించి వెంటిలేటర్లపై చికిత్స అందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా ఆయన డాక్టర్ల వైద్యానికి బాగా రెస్పాండ్ అవుతున్నాడని, వెంటిలేటర్లు తొలగించినట్లు ఆయన సోదరి ఎస్పీ శైలజా రెండు రోజుల క్రితం వెల్లడించారు.

అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగానే ఉందని, ఆయన ఆరోగ్యం మెరుగవుతున్నట్లు ఎలాంటి సూచనలు కనిపించడం లేదని ఆయన కొడుకు ఎస్పీ చరణ్ తాజాగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. తన తండ్రి ఆరోగ్యం కోసం అభిమానులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారని, వారి ప్రార్థనలే తన తండ్రికి ఆయుష్షు పోస్తాయని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఇక ప్రస్తుతం బాలుకు చికిత్స కొనసాగుతూనే ఉందని చరణ్ తెలిపాడు.

కాగా కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన బాలు, త్వరగా కరోనాను జయించి పూర్తి ఆరోగ్యంగా ఇంటికి చేరాలని పులువురు కోరుతున్నారు. అటు ఆయన అభిమానులు బాలు కోలుకోవాలని పలు ఆలయాల్లో పూజలు కూడా నిర్వహిస్తున్నారు. బాలు కరోనా మహమ్మారిని జయించి ఆరోగ్యంగా ఇంటిముఖం పట్టాలని పలువురు సినీ ప్రముఖులు కూడా కోరుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad