Home సినిమా టాలీవుడ్ న్యూస్ తేజు సినిమాకు దిల్ రాజే దిక్కు..?

తేజు సినిమాకు దిల్ రాజే దిక్కు..?

Solo Brathuke So Better Future Is In Dil Raju Hands

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని సుప్రీం హీరోగా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించడంలో పూర్తిగా సక్సెస్ అయిన ఈ హీరో, రీసెంట్‌గా ‘ప్రతిరోజు పండగే’ అనే సినిమాతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ను కూడా రిలీజ్‌కు రెడీ చేశాడు.

ఈ సినిమాను సుబ్బు డైరెక్ట్ చేస్తుండగా బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాను వేసవి కానుకా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ కరోనా వైరస్ ప్రభావంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇక థియేటర్లు తెరుచుకున్న వెంటనే ఈ సినిమాను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చినా, ఇప్పట్లో అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలంటూ భారీ ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. అయితే టాలీవుడ్‌లో స్టార్ హీరోల చిత్రాలు ఇప్పటివరకు నేరుగా ఓటీటీలో రిలీజ్ కాలేదు. దీంతో ఈ సినిమా నిర్మాత ఆలోచనలో పడ్డాడు.

అయితే రిలీజ్‌కు రెడీగా ఉన్న మరో చిత్రం ‘వి’ పరిస్థితి కూడా ఇలానే ఉంది. నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కలిసి నటిస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోవనే కారణంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే ప్లాన్‌లో దిల్ రాజు ఉన్నాడు. ఒకవేళ ఆయన ‘వి’ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తే, వెంటనే తేజు చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ కూడా ఓటీటీ ప్రత్యక్షమవుతుంది. ఇలా తేజు చిత్రం రిలీజ్ ఇప్పుడు దిల్ రాజు చేతిలో ఉండటంతో ఏం జరుగుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad