Home టాప్ స్టోరీస్ నా రూటే సపరేటు: యూవీ క్రియేష‌న్స్

నా రూటే సపరేటు: యూవీ క్రియేష‌న్స్

062ebb7887449

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రయోగ సినిమాలు స్వల్ప స్థాయిలో తెరకెక్కుతుంటాయి. దీనికి ప్రధాన కారణం నిర్మాతలు మరియు మూవీ బ్యానర్స్. బడా దర్శకులతో సినిమాలు చేయడం ద్వారా అధిక లాభం వస్తుందనే ఏకైక కారణంతో మూవీ ప్రొడ్యూసర్లు కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వరన్నది అక్షర సత్యం. ప్రతి ఏడాది ఆరు లేదా ఏడు పెద్ద సినిమాలు విడుదల అవుతాయి. ఇండస్ట్రీ విజయం సాధించాలంటే ఈ సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా ఆడాలి. అప్పుడే ఇండస్ట్రీ విజయం సాధిస్తుంది. అయితే కొత్త దర్శకులకు ఛాన్స్ ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడుతున్నారు. కానీ ఓ మూవీ బ్యానర్ మాత్రం అందుకు భిన్నంగా కేవలం కొత్త దర్శకులకు మాత్రమే ఛాన్స్ ఇస్తూ తెలుగు ఇండస్ట్రీలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.

కేవలం చిన్న దర్శకులతోనే అద్భుత విజయాలను సాధించిన ఏకైక బ్యానర్ యూవీ క్రియేష‌న్స్.  2014లో రన్ రాజా రన్ అనే చిన్న సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యానర్ అతి తక్కువ సమయంలోనే మంచి విజయాలను అందుకుంది. ఈ సినిమా ద్వారా సుజిత్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తరువాత మరో కొత్త దర్శకుడు రాధాకృష్ణకు అవకాశం ఇచ్చి “జిల్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. తర్వాత ప్రతి రోజు పండగే వంటి మరో చిన్న సినిమాతో హ్యాట్రిక్ హిట్ ను అందుకుంది.

వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ బ్యానర్ ఇక నుండి వరుసగా వెబ్ సిరీస్ లు మరియు చిన్న సినిమాలను తెరకెక్కించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో కూడా పూర్తిగా కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నట్టు సమాచారం. తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ క్రిష్ దగ్గర అసోసియేట్ గా పని చేస్తోన్న భార్గవ్ అనే వ్యక్తిని ఇప్పటికే డైరెక్టర్ గా పరిచయం చేయడానికి రంగం సిద్ధం అయింది. వాస్తవానికి యూవీ క్రియేష‌న్స్ బడా నిర్మాణ సంస్థ. ఈ సంస్థకు  టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సపోర్ట్ కూడా ఉంది. పెద్ద సినిమాలను తెరకెక్కించే అవకాశం ఉన్నప్పటికీ ఈ సంస్థ కొత్త దర్శకులను తెలుగు తెరకు పరిచయం చేస్తూ ఇండస్ట్రీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఇటువంటి రిస్క్ తీసుకొని మరే ఇతర నిర్మాణ సంస్థ తెలుగులో లేదని చెప్పడం అతిశయోక్తి కాదు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad