Home సినిమా 'సీత' మూవీ రివ్యూ ..!

‘సీత’ మూవీ రివ్యూ ..!

ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం మీద తేజ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘సీత’ చిత్రం ఈరోజు భారీ అంచనాల మధ్య విడుదలైంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా కథా కథానాయకులుగా నటించారు. సోను సూద్, తనికెళ్ళ భరణి ప్రధానమైన పాత్రలు పోషించారు. లేడీ ఓరియెంటెడ్ గా సాగిన ఈ సినిమాలో కాజల్ వైవిధ్యభరితమైన పాత్రలో నటించింది. మరి సీత ఎందరిని మెప్పించిందో .. ఎలా ఉందో చూద్దాము రండి.

కథలోకి వెళ్తే ..

చిన్ననాటి నుంచి జనాలందరికి దూరంగా ఉండి పెరిగిన అమ్మాయి సీత (కాజల్) డబ్బే లోకం … డబ్బే సర్వస్వముగా భావిస్తుంటుంది. తన ఎదుగుదల కోసం ఎంతటి పనికైనా తెగించే అమ్మాయి. డబ్బే తన ప్రపంచం.. డబ్బు కు తప్ప మనుషులకు , అనుబంధాలకు విలువలు ఇవ్వని అమ్మాయిగా విభిన్నమైన పాత్రలో నటించింది. ఈ విధమైన తత్వం తో ఉన్న సీతకు ఎంఎల్ఏ బసవ(సోనూసూద్) కు మధ్య ఐదు కోట్ల రూపాయల తో ఒక ఒప్పందాన్ని చేసుకుంటుంది. ఈ ఒప్పందం వలన సీత అనుకోని చిక్కులో చిక్కుకుంటుంది. ఈ చిక్కులో నుంచి ఎలా బయటపడాలో అర్దము కాక, అమాయకుడైన రఘురాం (శ్రీనివాస్ బెల్లంకొండ) ని తన స్వార్థంకోసం వాడుకునేందుకు ప్లాన్ చేస్తుంది. మరి ఆమె వేసి ప్లాన్ ఏంటి? ఆమె కోరిక నెరవేరుతుందా? ఆతర్వాత ఆ అమ్మాయి జీవితం ఎక్కడికి వెళ్తుంది? ఎలాంటి మలుపులు చోటు చేస్తుకుంటాయి? హీరో తో పరిచయం వలన ఆమె జీవితంలో వచ్చే మార్పులేంటి ? అనేదే ఈ మోడరన్ సీత కథ.. తెర మీద చూడాల్సిందే

నటీనటులు..

విబిన్నమైన నెగటివ్ పాత్రలో సీత ( కాజల్ ) సరైన న్యాయం చేసింది. ఆమె నటన ప్రతి సన్నివేశంలో సహజంగా ఉంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటన కొస్తే .. లోకంలో ఉన్న మనుషుల లోతులు సరిగ్గా తెలియని అమాయకుడు పాత్రలో అద్భుతముగా నటించాడు. మూవీ క్లైమాక్స్ లో అతని నటన ఎంతో జీవం పోసింది. ఎప్పటిలాగే సోనూసూద్ విలన్ పాత్రలో అందరిని మెప్పించాడు. కమెడీయన్ బిత్తిరి సత్తి తన నటనతో ప్రేక్షకులందరికి నవ్వులు పూయించాడు. పాయల్ రాజపుత్ జిగేల్ రాణి తన అందంతో థియేటర్ లో గోల పెట్టించింది.

సాంకేతికపరంగా :

సినిమాటోగ్ర‌ఫీ ఓకే అనిపించింది. అనూప్ రూబెన్స్ పాట‌లు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. మ్యూజిక్ రొటీన్ అనిపించింది. బ్యాగ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ వీక్ గా ఉన్నాయి. ద‌ర్శ‌కుడిగా తేజ దాదాపుగా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమయ్యాడు.

ప్లస్ పాయింట్స్:

కాజల్ నటన .
పాయల్ రాజపుత్ స్పెషల్ సాంగ్.
సోనూసూద్ నటన.
క్లైమాక్ లో బెల్లము కొండ శ్రీనివాస్ నటన.

మైనస్ పాయింట్స్:

కథ మొత్తం సీత చుట్టే తిరగడం.

Rating : 2.5/5.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad