Home సినిమా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్.. పరిస్థితి ఎలా ఉందంటే?

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్.. పరిస్థితి ఎలా ఉందంటే?

sp balu passport 1200x900 1

ప్రముఖ టాలీవుడ్ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గతకొంత కాలంగా చాలా తక్కువగా సినిమా పాటలు పాడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్న ఆయన ప్రస్తుతం కొన్ని టీవీ షోలు చేస్తున్నారు. అయితే తాజాగా ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్‌లో చాలా మంది ప్రముఖులకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఎస్పీ బాలుకు కూడా కరోనా సోకడంతో ఇండస్ట్రీ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.

దీనికి సంబంధించి ఆయన స్వయంగా ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనకు ఆరోగ్యం సరిగా లేదని, జలుబు, జ్వరం లక్షణాలు ఉండటంతో కరోనా టెస్ట్ చేయించుకున్నాడని, కరోనా పాజిటివ్ రిపోర్టు రావడంతో ఆసుపత్రిలో చేరినట్లు బాలు తెలిపారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయనకు కరోనా లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపినట్లు బాలు వెల్లడించారు.

దీంతో ఆయన అభిమానులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ఏదేమైనా కరోనా వైరస్ ఎవ్వరినీ వదలడం లేదని, అందరూ జాగ్రత్తగా ఉండాలని పలువురు ఈ సందర్భంగా కోరుతున్నారు. ఇక బాలు త్వరగా కరోనా వైరస్ నుండి కోలుకోవాలని పలువురు సెలబ్రిటీలు కోరారు. కాగా తనకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టవద్దని బాలు తన ఫ్యాన్స్‌ను కోరారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad