
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరీ హీరోగా ‘రొమాంటిక్’ అనే యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూరీ-ఛార్మీ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాతో తన కొడుకుకి ఎలాగైనా హిట్ అందించాలనే కసితో పూరీ ఉన్నాడు. ఇక ఈ సినిమా కథను తానే స్వయంగా రాస్తుండగా, ఈ సినిమాలో పలువురు స్టార్స్‌ను తీసుకుంటున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణను తీసుకున్నాడు పూరీ. కాగా ఇప్పుడు మరో కీలక పాత్రలో నటించేందుకు మరో సీనియర్ బ్యూటీ సిమ్రాన్‌ను పూరీ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆకాష్ పూరీ అత్తగా సిమ్రాన్ నటించనున్నట్లు తెలుస్తోంది. చాలా ప్రాముఖ్యమైన పాత్ర కావడంతో ఇందులో సీనియర్ హీరోయిన్ అయితేనే బాగుంటుందని భావించిన పూరీ, సిమ్రాన్‌ను సంప్రదించాడట. తాను చేయబోయే పాత్ర బాగుండటంతో సిమ్రాన్ కూడా ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకుందట.
మొత్తానికి ఇద్దరు సీనియర్ హీరోయిన్లను తన కొడుకు సినిమాలో దింపుతున్న పూరీ, ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో హిట్ చేయాలనే కసిగా ఉన్నాడు. ఇక ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అనిల్ పడూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.