
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాను చాలా స్పెషల్‌గా తీర్చిదిద్దేందుకు బోయపాటి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే వారు ఎవరనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన ఓ సీనియర్ బ్యూటీ నటించనున్నట్లు తెలుస్తోంది. గతంలో బాలయ్యతో హిట్ జోడీ అనిపించుకున్న సిమ్రాన్ ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా మరోసారి నటించనున్నట్లు తెలుస్తోంది.

కాగా బాలయ్య ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో సిమ్రాన్ నటిస్తుందని తెలుస్తోంది. ఏదేమైనా గతంలో బాలయ్యతో జోడీ కట్టి మెప్పించిన సిమ్రాన్ మరోసారి ఆయనకు హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ జోడీ ఇప్పుడు ఎలాంటి మ్యాజిక్‌ను రీక్రియెట్ చేస్తుందా అని అందరూ ఆసక్తగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య రైతు పాత్రలో, అఘోరా పాత్రలో నటిస్తున్నాడనే వార్తతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.