దివంగత సీనియర్ ఎన్టీరామారావు బయోపిక్ లో రెండో భాగం ‘మహానాయకుడు’. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. సీనియర్ ఎన్టీరామారావు రాజకీయరంగ ప్రవేశం ఎలా చేశాడు? అతి తక్కువకాలంలో పార్టీ స్థాపించిన నేతగా మహానాయకుడిగా ఎలా ఎఎదిగాడు? ప్రజల్లో తనకంటూ ప్రత్యేకత ఎలా సాదించాడు? ఇలా రాజకీయ జీవితం గూర్చి మహానాయుడి రెండో భాగంలో చూపించనున్నారు. ఈ సినిమా కి సంబందించిన ట్రైలర్ ని తాజాగా విడుదల చేశారు.
ట్రైలర్ లో ఇందిరాగాంధీ ఎన్టీఆర్ ఫోటోకి నమస్కారం చేస్తుంది. అప్పుడే ఓ వ్యక్తి అతను మన అప్పోజిషన్ అతనికి నమస్కారమేంటని ప్రశ్నిస్తాడు. దానికి ఇందిరాగాంధీ ఏ సమాధానం చెప్పకుండా అతని వైపు సీరియస్ గా చూస్తుంది. ఎన్టీఆర్ ఓడిపోయినప్పుడు లడ్డులు పంచుతున్నవెంటనీ ఎవరో ప్రశ్నిస్తే.. ‘మా బావ మొదటి సినిమా ఆడలేదట. ఆ తర్వాత సినిమా నుంచి తిరుగులేదట అని మా అక్క చెప్పిందంటూ ‘ లడ్డులు పంచుతుంటాడు వెన్నెల కిశోర్. ఇచ్చిన ‘ప్రతి మాట నిలబెట్టాలి.. చేసిన ప్రతి పని కనిపించాలి ఇన్ టైం ఆన్ డాట్’ అంటూ నేతలందరికీ ఎన్టీరామారావు వార్నింగ్ ఇస్తున్న డైలాగ్ అదరహో అనవచ్చు.
ఇంకా ఈ ట్రైలర్ లో ప్రజల్లోకి ఎన్టీఆర్ వెళ్లడం.. ఢిల్లీ వరకు అతను చేసిన రాజకీయాన్ని చేస్తూ పోరాడిన విధానంను, ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన పథకాల తీరును చూపించారు .. ఆ తర్వాత బసవతారకం అనారోగ్యానికి గురైనపుడు ఎన్టీఆర్ లో కలిగిన బాధను క్షుణ్ణంగా చూపించి, వారిద్దరూ కలిసి విశ్రాంతికై వెళ్లి గడిపిన క్షణాలను చూపించారు.
చివరగా “నిశ్శబ్దాన్ని చేతకానితనం అనుకోవద్దు.. మౌనం మారణాయుధంతో సమానమని మరిచిపోకు’ అంటూ ఆవేశం, అసహనముతో కూడిన డైలాగ్ బాగుందని చెప్పక తప్పదు. ‘కథానాయకుడు’ చిత్రం కొంతవరకు నిరాశపరచినా, ‘మహానాయకుడు’పై అభిమానుల ఆశలు ఖచ్చితంగా ఫలించనున్నట్లు ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. ఈ నెల 22వ తేదీన మహానాయుడు సినిమా భారీస్థాయిలో ప్రేక్షకుల ముందు రానుంది.