Home సినిమా టాలీవుడ్ న్యూస్ మహేష్ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన శృతి

మహేష్ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన శృతి

Shruti Haasan Completes Mahesh Babu Challenge

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగస్టు 9న తన పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. కేవలం తన కుటుంబ సభ్యుల మధ్య తన పుట్టిరోజును జరుపుకున్న మహేష్, ప్రకృతిని కాపాడే ప్రయత్నంలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించాడు. ఈ క్రమంలో ఒక మొక్కను నాటడమే కాకుండా మరో ముగ్గుర్ని ఇలా మొక్కలు నాటాలని కోరాడు. వారిలో తమిళ హీరో విజయ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, అందాల భామ శృతి హాసన్‌లు ఉన్నారు.

కాగా తమిళ విజయ్ ఇప్పటికే మహేష్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి తాను కూడా ఓ మొక్కను నాటాడు. ‘మహేష్ నీ కోసమే ఈ మొక్కను నాటుతున్నాను’ అంటూ కామెంట్ కూడా చేశాడు తమిళ హీరో విజయ్. ఇక తాజాగా అందాల భామ శృతి హాసన్ కూడా మహేష్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించింది. పర్యావరణాన్ని కాపాడే బాధ్యత తనకు కూడా ఉందంటూ, ఓ మొక్కను నాటేసింది ఈ బ్యూటీ. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మొత్తానికి మహేష్ నామినేట్ చేసిన ముగ్గురిలో ఇద్దరు ఈ ఫీట్‌ను పూర్తి చేయగా, తెలుగు హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కడే ఇంకా ఈ ఛాలెంజ్‌ను యాక్సెప్ట్ చేయలేదు. మరి తారక్ కూడా ఈ ఛాలెంజ్‌ను ఎప్పుడు స్వీకరిస్తాడా, ఎప్పుడు మొక్కను నాటుతాడా అని అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక మహేష్ బాబు, శృతి హాసన్‌లు గతంలో ‘శ్రీమంతుడు’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీలో కలిసి నటించిన సంగతి అందరికీ తెలిసిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad