Home సినిమా గాసిప్స్ ఐటెం పాపగా మారుతున్న బ్యూటీ.. సాహో అంటోన్న పుష్ప

ఐటెం పాపగా మారుతున్న బ్యూటీ.. సాహో అంటోన్న పుష్ప

Shraddha Kapoor Item Song In Pushpa

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించగా, కరోనా ప్రభావంతో ప్రస్తుతం షూటింగ్ వాయిదా వేసుకుంది. కాగా ఈ సినిమాను ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఓ హాట్ ఐటెం సాంగ్‌ను తెరకెక్కించాలని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నాడు.

సాధారణంగా సుకుమార్ సినిమాల్లో ఈ మాస్ మసాలా సాంగ్స్ కామన్. దీంతో పుష్ప చిత్రంలోనూ ఇదే సెంటిమెంట్‌ను ఫాలో అవ్వాలని ఆయన చూస్తున్నాడు. కాగా ఈ సినిమాలోని ఐటెం సాంగ్‌లో ఎవరిని తీసుకోవాలా అనే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే పాన్ ఇండియా చిత్రంగా పుష్ప రానుండటంతో ఈ ఐటెం సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ అనుకుంటోంది. దీంతో వారు ఈ పాటలో చిందులు వేసేందుకు స్టార్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను తీసుకోవాలని చూస్తున్నారు. గతంలో సాహో చిత్రంతో టాలీవుడ్ జనాలకు దగ్గరైన ఈ బ్యూటీ అయితే తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతారని చిత్ర యూనిట్ ఆలోచిస్తుంది.

Shraddha Kapoor Item Song

ఈ క్రమంలోనే పుష్ప చిత్రంలోని ఈ హాట్ సాంగ్‌లో నర్తించేందుకు శ్రద్ధా కపూర్‌ను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు, ఆమె ఇంకా తన నిర్ణయాన్ని తెలుపనట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా బన్నీ లాంటి సూపర్ డ్యాన్సర్‌తో సమానంగా చిందులు వేసి గట్టి పోటీ ఇవ్వగల శ్రద్ధా కపూర్ అయితే ఈ పాటకు పూర్తి న్యాయం చేయగలదని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరి ఈ పాటలో డ్యాన్స్ చేసేందుకు శ్రద్ధా కపూర్ ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి. కాగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాలో కన్నడ కుట్టి రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad