Home సినిమా టాలీవుడ్ న్యూస్ మేము మేము బాగానే ఉన్నాం : శివపార్వతి

మేము మేము బాగానే ఉన్నాం : శివపార్వతి

shiva parvathi

సినీ మరియు టీవీ సీరియల్ ఇండస్ట్రీలో అనేక మంది మేమందరం ఒకటేనని మాలో మనస్పర్థలు లేవని చెప్పుకొనే నటీనటులు పరిస్థితులు అనుకూలించినప్పుడు మాత్రం ఎదుటివారిపై విమర్శలకు, ప్రతి విమర్శలు దిగుతారు. ఆ సమయంలో మీడియా ప్రచారం చేసే కధనాలు వాళ్ళ వ్యాఖ్యలపై ఆధారపడి ఉంటాయి. తాజాగా సీరియల్ నటి నటి శివపార్వతి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం తెరతీశాయి. 24 గంటల క్రితం వీడియోని రిలీజ్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. “ప్రభాకర్ నటిస్తూ నిర్మిస్తున్న వదినమ్మ సీరియల్ లో నేను  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాను. ఆ సమయంలోనే నాకు కరోనా సోకింది, దాదాపు పది రోజులు ఆసుపత్రిలో ఉన్నాను. ఈ విషయం ప్ర‌భాక‌ర్‌కు, అత‌ని యూనిట్‌కు కూడా తెలుసు అయినా ఎవరు తనని పరామర్శించే లేదు. ఈ విష‌యంలో నేను ఎవ‌ర్నీ ఏమీ అన‌దలుచుకోలేదు. థ్యాంక్స్ చెప్ప‌ద‌ల్చుకున్నాను. ఎందుకంటే ఈ ప‌రిస్థితి రాక‌పోతే ఎవ‌రేంటి?‌ అని తెలిసేది కాదు. కానీ ఇప్పుడు తెలిసిందన్నారు. ఇక్కడ ఎవరి సమస్య వాళ్లదే, న‌టించామా? ఆ క్ష‌ణాన్ని, ఆ ప్ర‌దేశాన్ని, ఆ మ‌నుషుల‌ను అక్క‌డితో మర్చిపోయామా అనే విధంగా ఉండాలని అన్నారు.

కానీ నేడు ఆమె ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని తీసుకుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మరియు తోటి సభ్యులు ఎప్పుడూ నాకు సపోర్ట్ గా ఉన్నారు. పరుచూరి బ్రదర్స్ నాకు మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఏ విషయంలో నాకు ఇబ్బంది లేదు. నేను చేసిన వ్యాఖ్యలను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు అని ఆ క్షణంలో తన బాధను మాత్రమే వ్యక్తం చేశానని ఆమె సర్ది చెప్పారు. కరోనా సమయంలో ఎవరు ఎవరిపై విమర్శలు చేసుకోవాల్సిన అవసరం లేదని, తనని పలకరించలేదని మాత్రమే ఆవేదన చెందానని ఆమె తెలిపారు.

ప్రస్తుతం తనికి సానుభూతి గానీ ఆర్థిక సాయం గానీ అవసరం లేదని కేవలం మనోధైర్యం మాత్రమే కావాలని కోరుకుంటున్నట్లు అన్నారు. ఈ విషయంపై స్పందించిన ప్రభాకర్ తాను శివ పార్వతి కొడుకుతో టచ్ లోనే ఉన్నానని, అయితే కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల శివపార్వతి తమ అపార్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. చివరకు ఎన్నిసార్లు కొట్టుకున్న తిట్టుకున్నా మేమందరం ఒకటేనని మరోసారి నిరూపించారు. మధ్యలో మీడియా అబాసుపాలు అవ్వడం తప్ప వేరే ఏమీ జరగలేదు. అందుకే సినీ ఇండస్ట్రీలోని గొడవలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad