
అర్జున్ రెడ్డితో సౌత్ ఇండియాలో సంచలనం సృష్టించిన బ్యూటీ షాలినీ పాండే. ఆమె కెరీర్ గురించి చెప్పాలంటే….అర్పున్ రెడ్డికి ముందు ఆ తర్వాత అనే చెప్పాలి. ఆ సినిమాతో విజయ్ ఓవర్ నైట్‌లోనే స్టార్ అయిపోయాడు. ఆ సినిమాలో బోల్డ్ గా నటించి కుర్రకారు మనసులను కొల్లగొట్టింది షాలినీ. అయితే.. అర్జున్ రెడ్డి రిలీజైన తర్వాత విజయ్‌కు ఎంతో పేరు వచ్చిందో…అందులో నటించిన షాలినీకి కూడా అంతే పేరు వచ్చింది. అర్జున్ రెడ్డి తర్వాత షాలినీకి తమిళంలో వరుసగా నాలుగు చిత్రాల్లో నటించింది.
మరో వైపు తెలుగులో మహానటి, 118, కథనాయకుడు సినిమాల్లో నటించింది. కానీ అవి గెస్ట్ రోల్స్ మాత్రమే. నిజానికి షాలినీని వెతుక్కుంటూ ఎన్నో కమర్షియల్ సినిమాలు వచ్చాయి. కానీ వాటిని ఈ బోల్డ్ బ్యూటీ ఒప్పుకోలేదు. తన పాత్ర తీరు తెన్నులేంటి…కథలో నా రోల్ ఏంటి…ఆ రోల్ లో డెప్త్ ఏంటి లాంటి ప్రశ్నలు అడిగి దర్శకులు సహనానికి పరీక్ష పెట్టేదట. దీంతో తెలుగు దర్శకులు ఆమెను పక్కన పెట్టారని ఒక టాక్ వినిపిస్తుంది. అయితే షాలినీ ఈ స్థాయికి రావడానికి….చాలా ఇబ్బందులు పడిందట.
1993 సెప్టంబర్ 23న మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో షాలినీ జన్మించింది. ఒక మధ్య తరగతి ప్రభుత్వ ఉద్యోగి కూతురు షాలినీ. జబల్పూర్ గ్లోబల్ ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. నటనపై ఉన్న ఆసక్తితో ఇంజినీరింగ్ రెండో ఏడాది నుంచే నాటకాల్లో నటించడం మొదలలుపెట్టింది.
ఇంజినీరింగ్ చదివే సమయంలోనే …..సినిమాల్లోకి వెళ్తానని ఇంట్లో చెప్పేసింది. కానీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో….చదువను పూర్తి చేసింది. అదే సమయంలో థియేటర్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంది. నటనలో ప్రతిభ చూపడంతో…. ముందు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. తర్వాత ఏమైందో కానీ…సినిమాల్లోకి వద్దని పేరెంట్స్ తేల్చిచెప్పారు. దీంతో తండ్రితో విభేదించింది. చివరకు ఒప్పుకోకపోవడంతో…ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది.
ముంబైలో స్నేహితురాలి ఇంటికి వెళ్లిన షాలినీ తిరిగి రాలేదు. సినిమాల్లో నటించడానికి ఒప్పించేంత వరకు రానని చెప్పేసింది. అయినా కూడా తండ్రి ఒప్పుకోలేదు. ఇంటికి రావాలని పట్టుబట్టారు. దీంతో షాలినీ తాను మేజర్‌ను అని…తనను బలవంతంగా తీసుకెళ్తే కేసు కూడా పెడతానని కన్నతండ్రిపైనే పోరాటం చేసింది. దీంతో షాలినీ తండ్రి మెరప్పుడూ ఇంటికి రావద్దని తేల్చిచెప్పాడు. ఇంత జరిగినా….సినిమా వేషాల కోసం ప్రయత్నాలు ఆపలేదు. రకరకాల ప్రయత్నాలు చేసింది.
డబ్బులు లేకపోవడంతో …..చిన్న గదిలో అద్దెకు ఉండేది. ఒకోసారి తినడానికి తిండి కూడా లేని పరిస్థితికి వెళ్లిందట. డబ్బులు మిగుల్చుకోవడం కోసం….. సినిమా ఆఫీసులకు నడిచే వెళ్లేదట. కొన్నిసార్లు డబ్బులు లేక భోజనం కూడా చేసేది కాదట. అప్పుడే అర్జున్ రెడ్డి సినిమాలో అవకాశం వచ్చింది. ఇక కష్టాలు తీరినట్టే అనుకుంది. కానీ ఆ సినిమా షూటింగుకు రెండు నెలల సమయం ఉందట. అప్పటికే షాలినీ దగ్గర్లో ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. దీంతో ఏమీ చేయాలో అర్ధం కాలేదు. దీంతో తనకు తెలిసిన ఇద్దరు అబ్బయిల వద్ద …..ఒకే రూమ్ లో రెండు నెలలు ఉంది. నా అన్న వాళ్లు ఎవరూ లేని సమయంలో నా ఫ్రెండ్స్ అండగా ఉన్నారని…వారిని ఎప్పటికీ మరవలేనని చెబుతోంది. అలా ఎన్నో బాధలు పడి …..చివరకు అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోయిన్ అయ్యింది. ఈ విషయాలన్నింటినీ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది.